https://oktelugu.com/

Anasuya Bharadwaj: చిన్న సినిమాలపై అనసూయకు ఎందుకంత కోపం?

Anasuya Bharadwaj:  తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సినిమాల్లో కూడా నటిస్తోంది. రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల ద్వారా తనలోని నటనా కౌశలాన్ని బయటపెట్టిన నటి. స్టార్ హీరోలతో నటిస్తూ దూసుకుపోతోంది. జబర్దస్త్ షో లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె చిన్న సినిమాలపై మాత్రం చిన్న చూపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన దర్జా సినిమా ప్రమోషన్ లలో పాల్గొనడం లేదనే వాదనలు వస్తున్నాయి. ఆమెను నమ్ముకుని […]

Written By: , Updated On : April 16, 2022 / 01:20 PM IST
Follow us on

Anasuya Bharadwaj:  తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సినిమాల్లో కూడా నటిస్తోంది. రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల ద్వారా తనలోని నటనా కౌశలాన్ని బయటపెట్టిన నటి. స్టార్ హీరోలతో నటిస్తూ దూసుకుపోతోంది. జబర్దస్త్ షో లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె చిన్న సినిమాలపై మాత్రం చిన్న చూపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన దర్జా సినిమా ప్రమోషన్ లలో పాల్గొనడం లేదనే వాదనలు వస్తున్నాయి.

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఆమెను నమ్ముకుని ఆమె ప్రధాన పాత్రలో నిర్మించిన దర్జా సినిమా దాదాపు పూర్తయింది. నిర్మాతలు కూడా ఆమెను నమ్మి ఖర్చు పెట్టారు. కానీ ఆమె ప్రమోషన్లలో పాల్గొనకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిత్రాలపై ఎందుకంత నిర్లక్ష్యం అని ప్రశ్నిస్తున్నారు. పెద్ద సినిమాలకైతే ఆమె అన్నింట్లో ముందుండి నడిపిస్తారు. చిన్న సినిమాల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు.

Also Read: Beast Box Office Collection: మూడోరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వ‌సూలు చేసిన బీస్ట్‌.. ఇంకెంత రావాలంటే..?

రంగస్థలం, పుష్ప సినిమాలకు మాత్రం ప్రమోషన్లలో అనసూయ పాల్గొని అందరికి కనిపింది. అయితే ఇప్పుడు దర్జా సినిమాలో ఎందుకు పాల్గొనడం లేదని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినిమా విడుదల దగ్గర పడుతోంది. సినిమా ట్రైలర్ విడుదలకు కూడా రాకపోవడంతో నిర్మాతల్లో భయం పట్టుకుంది. ఆమెను నమ్ముకుని తీసిన సినిమా కావడంతో ప్రమోషన్లలో ఎందుకు పాల్గొనడం లేదో అర్థం కావడం లేదని చెబుతున్నారు.

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

తన ఇమేజ్ నే నమ్ముకున్న నిర్మాతలు ఇప్పుడు ఎలా గట్టెక్కుతారనే ప్రశ్నలు వస్తున్నాయి. అనసూయ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చిన్న సినిమాలను బతికించాల్సిన నటులు ఇలా వ్యవహరించడంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. తాము నమ్మకున్నందుకు నట్టేట ముంచడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అనసూయ ప్రవర్తన విమర్శలకు తావిస్తోంది. సినిమా ప్రభావం ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడ్డారు.

Also Read:Prabhas: ఎన్టీఆర్‌, య‌శ్‌, రామ్‌చ‌ర‌ణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్ర‌భాస్‌..

Tags