Ghani Release Date : మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తూ. అలానే మరోవైపు కిరణ్ కోర్రపాటి దర్శకత్వంలో “గని” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని చిత్ర బృందం వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 18వ తేదీన థియేటర్ లో విడుదల కాబోతుంది అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేసింది.ఈ సినిమా కోసం వరుణ్ జిమ్‌లో కఠోరమైన వ్యాయామాలతో తన బాడీ ఆకృతిని మార్చారు. చూడాలి మరి వరుణ్ కష్టానికి ఈ సినిమా ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేది తెలియాలంటే వచ్చే ఏడాది మార్చి 18 వరకు ఆగాల్సిందే.నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.