Anchor Varshini: ఆడిషన్ అని చెప్పి పడుకోమన్నాడు.. ఆ దర్శకుడిపై వర్షిణి సెన్సేషనల్ కామెంట్స్

కొద్ది రోజుల్లోనే ఢీ నుండి బయటకు వచ్చిన వర్షిణి కి సినిమాల్లో మంచి అవకాశాలే వస్తున్నాయి. దీంతో తన ఫోకస్ పూర్తిగా వెండితెర మీద పెట్టింది. అయితే సినీ పరిశ్రమలో ఎక్కడైనా కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం.

Written By: Shiva, Updated On : August 9, 2023 12:23 pm

Anchor Varshini

Follow us on

Anchor Varshini: బుల్లితెర మీద సందడి చేసి మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత వెండితెర మీద అవకాశాలు పొందిన వాళ్ళల్లో వర్షిణి కూడా ఒకరు. అనసూయ, రష్మీ లాంటి బుల్లితెర మీద సక్సెస్ అయ్యి, వెండితెర మెరిశారు. వర్షిణి కూడా మొదటి లో పటాస్ షో ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఏకంగా ఢీ షో లో మెరిసింది. కానీ అక్కడ కేవలం అందాల విందు కే పరిమితం అయ్యింది ఈ అమ్మడు.

కొద్ది రోజుల్లోనే ఢీ నుండి బయటకు వచ్చిన వర్షిణి కి సినిమాల్లో మంచి అవకాశాలే వస్తున్నాయి. దీంతో తన ఫోకస్ పూర్తిగా వెండితెర మీద పెట్టింది. అయితే సినీ పరిశ్రమలో ఎక్కడైనా కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. ఇందుకు వర్షిణి ఏమి మినహాయింపు కాదనే చెప్పాలి. తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని లాక్ డౌన్ కి ముందు ఒక వెబ్ సిరీస్ చేయడానికి ఒక డైరెక్టర్ నుండి పిలుపు వస్తే ఆడిషన్స్ కోసం వెళ్ళాను. ఒక స్టార్ హోటల్ లో ఆ దర్శకుడి ని కలిసాను. ఆడిషన్ ఇస్తే బాగుంటుందని అన్నారు. అంతలోనే అతని నిజ స్వరూపం ఏమిటో అర్థం అయ్యింది. నా చెయ్యి పట్టుకొని బెడ్ మీదకి లాగేశాడు. ఒక్కసారిగా నాకు భయం వేసింది. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి, కారు లో కూర్చొని ఏడ్చాను. నా లైఫ్ లో జరిగిన ఏకైక సంఘటన ఇదే. ఇలాంటి చేదు అనుభవం నాకు ఎప్పుడూ జరగలేదు. ఆ దర్శకుడి ఆలోచన ఏమిటో నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను ఎప్పుడు అతనిని కలవలేదు అంటూ చెప్పుకొచ్చింది వర్షిణి.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కొందరు నటీమణులు కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నారు. రీసెంట్ గా బేబీ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిర్రాక్ సీత కూడా తనను దర్శకుడు, నిర్మాత గెస్ట్ హౌస్ కి రమ్మన్నారని నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కిర్రాక్ సీత చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో దీనిపై కొన్ని భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు కమిట్మెంట్ కి ఒప్పుకొని అవసరం తీరిన తర్వాత సానుభూతి కోసం తాము కూడా కాస్టింగ్ కౌచ్ బాధితులమే అంటూ అమాయకత్వంగా నటిస్తున్నారంటూ ఒక వర్గం ఆరోపిస్తుంది.