Chiranjeevi : అందరివాడు చిరంజీవిని దూరం చేసుకున్న మీరు పతనం చూడక తప్పదు

ఇది సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి ఇచ్చిన సలహా. దీన్ని హుందాగా స్వీకరించాల్సిందిపోయి ఏదో అసభ్యత పదజాలం ఉందనో.. అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఎవరైనా అనుకుంటారా? కానీ చిరంజీవిని మంత్రులందరూ అనరాని మాటలు అన్నారు.

Written By: Bhaskar, Updated On : August 9, 2023 4:46 pm

Chiranjeevi : కక్కువచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. పోయేకాలం దాపురిస్తే ఎవ్వరు ఆపాలనుకున్న ఆగదు. అక్షరాల వైసీపీకి ఇది పతనంగా కనిపిస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని మరీ కెలుక్కొని మరీ దూరం చేసుకోవడం అంటే ఇదేనేమో.. తమ్ముడు రాజకీయాల్లో మునిగితేలుతున్నా.. అందరివాడిగానే చిరంజీవి ఉంటున్నాడు. సినిమా పరిశ్రమ ఇక్కట్లలో ఉంటే తన స్థాయిని తగ్గించుకొని జగన్ వద్దకు వెళ్లి అర్థించాడు. ఆ సీన్ చూసినవారంతా ఇప్పటికీ చిరంజీవి చేసిన పనిని డైజెస్ట్ చేసుకోవడం లేదు. తనకు భిక్ష పెట్టినటువంటి సినీ పరిశ్రమ బాగోగుల కోసం అన్ని మింగుకొని వెళ్లి జగన్ ను అర్థించాడు.

ఎవ్వరు ఏమనుకున్నా.. తెలుగు కళామతల్లి కోసం నేను జగన్ వద్ద లొంగాను అని చిరంజీవి అనుకున్నారు. ఎప్పుడూ చిరంజీవి సభ్యత మరిచి ప్రవర్తించడు. మాట తూలాడు. సినీ పరిశ్రమ పెద్దగా ఉన్నా చిరంజీవి పరిశ్రమకు వార్నింగ్ ఇస్తే.. ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ లాంటి పిచ్చుక మీద ప్రభుత్వ యంత్రాంగం లాంటి బ్రహ్మస్త్రం ఎందుకు అంటూ కోరారు. ఏపీ సమస్యలు, హామీలపై దృష్టి పెట్టండని సలహా ఇచ్చారు.

ఇది సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి ఇచ్చిన సలహా. దీన్ని హుందాగా స్వీకరించాల్సిందిపోయి ఏదో అసభ్యత పదజాలం ఉందనో.. అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఎవరైనా అనుకుంటారా? కానీ చిరంజీవిని మంత్రులందరూ అనరాని మాటలు అన్నారు. ఇదంతా కాకతాళీయంగా అనలేదు. వైసీపీ బ్యాచ్ ఒక పద్ధతి ప్రకారం దాడి చేయించారు. చిరంజీవి కాపు సామాజికవర్గం మంత్రులతోనే దాడి చేయించారు.

చిరంజీవిపై వైసీపీ దాడి గురించి ‘రామ్ గారి విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.