CM Jagan: పిల్లాడికి పేరు పెట్టిన జగన్.. ఏం పేరు తెలిస్తే అవాక్కే

సీఎం జగన్ ప్రస్తుతం వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. కూనవరం,విఆర్ పురం మండలాల్లో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను స్వయంగా కలుసుకున్నారు.

Written By: Dharma, Updated On : August 9, 2023 12:10 pm

CM Jagan

Follow us on

CM Jagan: ఏపీ సీఎం జగన్ తరచూ దేవుడు అని సంబోధిస్తుంటారు. భగవంతుడిని తలుచుకుంటారు. కష్టం వచ్చినా… సుఖం వచ్చినా అదే మాట చెబుతుంటారు. విపక్షాలు విమర్శలు చేసినా.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. పైన దేవుడు ఉన్నాడు.. కింద ప్రజలు ఉన్నారు.. దేవుని చల్లని చూపులతో.. చల్లని దీవెనలతో.. అన్న పదాన్ని ప్రతి సందర్భంలోనూ వాడుతుంటారు. ఇప్పుడు ఓ బాలుడు నామకరణం లో కూడా అదే స్మరణ చేశారు.

సీఎం జగన్ ప్రస్తుతం వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. కూనవరం,విఆర్ పురం మండలాల్లో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను స్వయంగా కలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన సహాయక చర్యల గురించి ఆరా తీశారు. రాత్రికి రాజమండ్రిలో బస చేశారు. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా కూనలంక గ్రామములో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శించే క్రమంలో.. ఓ దంపతులు వద్ద ఉన్న నెలల బాలుడ్ని జగన్ గమనించారు. వారి చేతుల్లో ఉన్న బాబును తీసుకున్న జగన్ ఎత్తుకొని ముద్దాడారు. ఏం పేరు పెట్టారని తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఇంకా పేరు పెట్టలేదని.. డి అనే అక్షరంతో పేరు పెట్టాలని వారు కోరారు. మీకు నచ్చిన పేరు ఏమిటని జగన్ వారిని తిరిగి ప్రశ్నించారు. అయితే వారు మీకు నచ్చిన పేరు పెట్టాలని సీఎం జగన్ను కోరారు. దీంతో ప్రేమతో మరోసారి చిన్నారిని జగన్ ముద్దాడారు. దేవుడు అని పేరు పెట్టారు. దీంతో ఆ తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.