Varasudu Collections: మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ , మార్కెట్ ఉన్న తమిళ హీరోలు ఎవరూ అని అడిగితే సూపర్ స్టార్ రజినీకాంత్, సూర్య పేర్లే చెప్పేవారు..ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు..వాళ్ళిద్దరి స్థానంలోకి ఇళయదళపతి విజయ్ వచ్చేసాడు..’తుపాకీ’ సినిమాకి ముందు తెలుగు ఆడియన్స్ కి విజయ్ అంటే ఎవరో కూడా తెలియదు.

అతని ముఖం చూసి ‘ఛీ..ఇతను హీరోనా.. ఏమిటి ఈ తమిళ ఆడియన్స్ టేస్ట్ ఇలా ఉంది’ అని అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.. అలాంటి హీరో ఇప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. తాజాగా ఆయన హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వారిసు’ ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేసారు.. అక్కడ పెద్ద హిట్ అయ్యింది.. ఇక్కడ కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది.. మూడు రోజులకు కలిపి ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసుకుందాం.
ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 3.67 కోట్లు
సీడెడ్ 1.27 కోట్లు
ఉత్తరాంధ్ర 1.19 కోట్లు
ఈస్ట్ 0.58 కోట్లు
వెస్ట్ 0.49 కోట్లు
నెల్లూరు 0.40 కోట్లు
గుంటూరు 0.56 కోట్లు
కృష్ణ 0.57 కోట్లు
———————
మొత్తం 08.73 కోట్లు
ఈ సినిమా తమిళంలో విడుదలైన మూడు రోజుల తర్వాత తెలుగులో విడుదల చేసారు.. లేట్ రిలీజ్ అయితే సినిమా మీద ప్రభావం పడుతుందని అందరూ అనుకున్నారు.. కానీ దిల్ రాజు మాత్రం ‘నా సినిమా మీద నాకు నమ్మకం ఉంది..ఎప్పుడు విడుదల చేసినా మంచి వసూళ్లను రాబడుతుంది’ అని అన్నాడు.. ఆయన నమ్మకం ఈరోజు నిలబడింది.

ఒక పక్క జనాలు ‘వాల్తేరు వీరయ్య’ ,’వీర సింహా రెడ్డి’ సినిమాల మేనియా ని ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కూడా ‘వారసుడు’ సినిమా మధ్యలో విడుదలై 8 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టడం మామూలు విషయం కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా అన్ని భాషలకు కలిపి ఆరు రోజులకు గాను 188 కోట్ల రూపాయిల గ్రాస్ , 96 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు.