Manchu Lakshmi: మోహన్ బాబు వారసులు ముగ్గురూ ఫెయిల్. ఎవరి సపోర్ట్ లేకుండా మోహన్ బాబు పెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ తో మొదలైన ఆయన ప్రస్థానం విలన్ గా మారి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగే వరకూ చేరింది. 500 చిత్రాలకు పైగా నటించిన అరుదైన నటుల్లో మోహన్ బాబు ఒకరు. వెండితెర వైభవం ఆయనతోనే ముగిసింది. ఆయన కొడుకులు మంచు విష్ణు, మనోజ్ ముందుకు తీసుకెళ్లలేకపోయారు. కనీసం టైర్ టూ హీరోలు కాలేకపోయారు. మనోజ్ వెండితెరపై కనిపించి ఏళ్ళు గడుస్తున్నాయి. విష్ణు సినిమాలు చేస్తున్నప్పటికీ విజయం దక్కడం లేదు.

మరోవైపు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా ఫెయిల్యూర్ ప్రొడక్ట్ గా మిగిలిపోయింది. హీరోయిన్ కావాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. నటిగా అడపాదడపా చిత్రాలు చేస్తున్నా… సక్సెస్ దక్కడం లేదు. అమెరికాలో టెలివిజన్ హోస్ట్ గా మంచు లక్ష్మి కెరీర్ మొదలైంది. టాలీవుడ్ కి వచ్చాక అనేక బుల్లితెర టాక్ షోలు చేశారు. ఒక్క షోకి కూడా చెప్పుకోదగ్గ ఆదరణ దక్కలేదు. అసలు సమస్య ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితి.
దానికి తోడు ట్రోల్స్, మీమ్స్. మంచు ఫ్యామిలీ అంటే ట్రోలర్స్ ఎగబడతారు. వాళ్ళ సినిమాలు, మాటలను ఎగతాళి చేస్తూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తారు. మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా, మంచు విష్ణు జిన్నా ఫెయిల్యూర్ కి కారణం ట్రోలర్స్ అని వారు నేరుగా ఆరోపించారు. మంచు విష్ణు ఓ బడా హీరో ఏకంగా ఆఫీస్ మైంటైన్ చేస్తూ మాపై ట్రోల్స్ కి పాల్పడుతున్నాడంటూ ఆరోపించడం జరిగింది. ఎవరు ఎంతగా ట్రోల్ చేసినా మంచు లక్ష్మి మాత్రం… ఐ డోంట్ కేర్, అంటుంది.

అందుకే వయసుతో సంబంధం లేకుండా హాట్ అండ్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా డిజైనర్ శారీ ధరించి కిరాక్ ఫోజులిచ్చింది. ఫోటోల సంగతి అటుంచితే టెంప్టింగ్ కామెంట్ చేశారు. ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటో షూట్ కి ”బీట్ రూట్ లేక వైన్” క్రింద కామెంట్ చేయండని మంచు లక్ష్మి కామెంట్ పెట్టింది. మీకు ఏది కావాలని ఆమె అడిగినట్లు ఆ పోస్ట్ ఉంది. మంచు లక్ష్మి కామెంట్ చూసిన జనాలు రచ్చ చేస్తున్నారు. తమ ఫీలింగ్స్ కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు.
View this post on Instagram