Hari Hara Veera Mallu Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’.. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో రిచ్ గా తెరకెక్కిస్తున్నాడు.. మొఘల్ కాలం నాటి కథ కావడంతో నిర్మాత ఏఏం రత్నం కూడా ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాకి డబ్బులు పెట్టేస్తున్నాడు.

ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన రెండు గ్లిమ్స్ వీడియోస్ కి అభిమానులు , ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇక ఈ సినిమా కథ ఏంటో తెలిసేలాగా ఒక టీజర్ ని వదిలితే చూడాలనే ఆశతో అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.. వాస్తవానికి డిసెంబర్ 31 వ తేదీన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ రీ రిలీజ్ అయ్యింది.. ఆ సినిమాతోనే ఈ టీజర్ ని కూడా అటాచ్ చేసి విడుదల చేద్దాం అనుకున్నారు.
కానీ ఆ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి అందుబాటులో లేకపోవడం వల్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెండింగ్ ఉండడంతో విడుదల చేయలేకపోయారు.. ఇప్పుడు ఈ టీజర్ ని జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతోంది మూవీ టీం.. రామోజీ ఫిలిం సిటీ లో సుమారుగా రెండు నెలల పాటు ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసింది మూవీ టీం.. ఈ షెడ్యూల్ మొత్తం ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు కొనసాగే ఒక పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించారట.

ఆ సన్నివేశంలోని కొన్ని షాట్స్ ని తీసుకొని టీజర్ గా చేసి 26వ తేదీన విడుదల చేయబోతున్నట్టు సమాచారం.. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ గెడ్డం లుక్ తో కనిపిస్తాడు.. ఈ సినిమా మొత్తంలో ఆయన మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తూ 30 రకాల అవుట్ ఫిట్స్ లో కనిపించబోతున్నాడట.. ఈ సమ్మర్ కానుకగా థియేటర్స్ లోకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.