Homeఎంటర్టైన్మెంట్Varanasi Movie Villain Role: వారణాసి లో మెయిన్ విలన్ గా నటిస్తున్న ఒకప్పటి స్టార్...

Varanasi Movie Villain Role: వారణాసి లో మెయిన్ విలన్ గా నటిస్తున్న ఒకప్పటి స్టార్ హీరో….

Varanasi Movie Villain Role: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి ఈ సినిమాని చాలా ప్రెస్టేజీయస్ ప్రాజెక్టుగా తీసుకొని మరీ చేస్తున్నాడు. మొదట 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది అనుకోని బరిలోకి దిగినప్పటికి ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఈ సినిమాకి 1500 కోట్ల వరకు బడ్జెట్ అయితే అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను […]

Varanasi Movie Villain Role: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి ఈ సినిమాని చాలా ప్రెస్టేజీయస్ ప్రాజెక్టుగా తీసుకొని మరీ చేస్తున్నాడు. మొదట 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది అనుకోని బరిలోకి దిగినప్పటికి ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఈ సినిమాకి 1500 కోట్ల వరకు బడ్జెట్ అయితే అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను నెక్స్ట్ షెడ్యూల్లో చిత్రీకరించే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడట. ఈ సినిమాలో విలన్ గా మలయాళం నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక దానికి సంబంధించిన పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి… విలక్షణ నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న విక్రమ్ ని ఇందులో భాగం చేయాలని రాజమౌళి చూస్తున్నాడట. అయితే అతనికి సపరేట్ క్యారెక్టర్ గా ఉండబోతుందట. క్లైమాక్స్ లో కనిపించే అతని క్యారెక్టర్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలువబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక విక్రమ్ చేయబోయే క్యారెక్టర్ లో వేరియేషన్స్ కూడా చాలానే ఉన్నాయట.

ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఏం చేసినా సక్సెస్ ఫుల్ గా నిలుస్తుంది. కాబట్టి విక్రమ్ సైతం అతని సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. తొందర్లోనే విక్రమ్ ను ఈ సినిమాలో చేర్చుకొని షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నాడట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడానికి ముస్తబ్ అవుతుంది.

కాబట్టి భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది… ఈ సినిమాతో రాజమౌళి మరోసారి తన సత్తాని చాటుతాడని అతని అభిమానులు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. గతంలో రాజమౌళి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

1300 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే కొల్లగొట్టింది. అది ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ అవ్వలేకపోయింది. అందుకే రాజమౌళి ‘వారణాసి’ సినిమాతో ఇండియాలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రేక్షకులను మెప్పిస్తూ వరల్డ్ వైడ్ గా భారీ రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper