Varalakshmi Sarathkumar
Varalakshmi: టాలీవుడ్ లో లేడీ విలన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సూర్యకాంతం. బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఆమె లేడీ విలన్ గా వెండితెరను ఏలారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టే కన్నింగ్ లేడీగా సూర్యకాంతం వందల చిత్రాల్లో నటించారు. గయ్యాళి పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు. సూర్యకాంతం తర్వాత ఆ స్థాయిలో ఎవరూ లేడీ విలన్ గా సక్సెస్ కాలేదు. ట్రెండ్ మారడంతో కథలు, సినిమా నేపధ్యాలు మారిపోయాయి. ఆడవాళ్లు ప్రధాన విలన్స్ గా తెరకెక్కే సినిమాలు తక్కువైపోయాయి.
Varalakshmi
ఈ మధ్య కాలంలో మెల్లగా ఆ తరహా ట్రెండ్ మరలా మొదలవుతుంది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా లేడీ విలన్ పాత్రలు కీలకంగా ఉంటున్నాయి. కాగా హీరోలను సవాలు చేసే కరుడు గట్టిన లేడీ విలన్ గా ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ ఫేమస్ అయ్యారు. ఆమెకు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు క్యూ కడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆమె పలు చిత్రాల్లో విలన్ గా కనిపించారు. అలాగే కొన్ని అప్ కమింగ్ చిత్రాల్లో ఆమె విలన్ గా నటిస్తున్నారు.
Also Read: అప్పుపై కోపంతో రగిలిపోయిన వంటలక్క.. ఏకంగా డాక్టర్ బాబు ఆ మాట అనడంతో!
సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి చిత్రంలో వరలక్ష్మి నెగిటివ్ రోల్ చేశారు. అనంతరం క్రాక్ మూవీలో ఊరమాస్ విలన్ రోల్ చేశారు. క్రాక్ లో ప్రధాన విలన్ కటారి కృష్ణ వైఫ్ గా వరలక్ష్మి నటించారు. క్రాక్ సినిమాలో వరలక్ష్మి పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది.రవితేజ వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు అబ్బురపరుస్తాయి.
కాగా దర్శకుడు గోపీచంద్ నెక్స్ట్ మూవీకి కూడా వరలక్ష్మిని తీసుకోవడం విశేషం. నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వేటపాలెం అనే పేరు పరిశీలనలో ఉంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ లో వరలక్ష్మి నటిస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. అలాగే సందీప్ కిషన్ లేటెస్ట్ ప్రాజెక్ట్ మైఖేల్ చిత్రంలో వరలక్ష్మి నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో వరలక్ష్మి నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆ మధ్య సమంత యశోద పేరుతో పాన్ ఇండియా చిత్రం ప్రకటించారు. ఈ మూవీలో వరలక్ష్మి రోల్ ఏంటి అనేది తెలియదు. ఆ విధంగా వరుసగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పత్రాలు దక్కించుకుంటూ వరలక్ష్మి నేటి సూర్యకాంతం అనిపించుకుంటుంది.
Also Read: కేంద్రంలో ఆ పార్టీ.. ఏపీలో ఈ పార్టీ.. అధికారం వారిదేనంటున్న సీ-ఓటర్ సర్వే..