https://oktelugu.com/

Air Hostess: ఎయిర్ హోస్టెస్‌గా అమ్మాయిలే ఎందుకు ఉంటారో తెలుసా..?

Air Hostess: విమానాల్లో ప్రయాణించేటప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తుంటారు. అబ్బాయిలు ఎక్కడైనా కనిపిస్తారేమో అని మనం వెతికితే మచ్చుకైనా కనిపించరు. ఎయిర్ హోస్టెస్‌గా అసలు అమ్మాయిలనే ఎందుకు నియమించుకుంటారు. అబ్బాయిలను ఎందుకు నియమించుకోరని చాలా మందికి అనుమానం కలుగక మానదు. విమానాల్లో అమ్మాయలు చేసే పనే సాధారణంగా స్టార్ హోటల్స్‌లో అబ్బాయిలు చేస్తుంటారు. మరి విమానాల్లో వీరిని ఎందుకు తీసుకోరు. అందం పరంగా చూసుకుంటే ఫ్యాషన్, మోడలింగ్ రంగంలో అబ్బాయిలకు కూడా స్థానం ఉంటుంది. […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 21, 2022 2:22 pm
    Follow us on

    Air Hostess: విమానాల్లో ప్రయాణించేటప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తుంటారు. అబ్బాయిలు ఎక్కడైనా కనిపిస్తారేమో అని మనం వెతికితే మచ్చుకైనా కనిపించరు. ఎయిర్ హోస్టెస్‌గా అసలు అమ్మాయిలనే ఎందుకు నియమించుకుంటారు. అబ్బాయిలను ఎందుకు నియమించుకోరని చాలా మందికి అనుమానం కలుగక మానదు. విమానాల్లో అమ్మాయలు చేసే పనే సాధారణంగా స్టార్ హోటల్స్‌లో అబ్బాయిలు చేస్తుంటారు. మరి విమానాల్లో వీరిని ఎందుకు తీసుకోరు. అందం పరంగా చూసుకుంటే ఫ్యాషన్, మోడలింగ్ రంగంలో అబ్బాయిలకు కూడా స్థానం ఉంటుంది.

    Air Hostess

    Air Hostess

    అలాంటప్పుడు క్యాబిన్ క్రూ సిబ్బందిగా మగువలనే ఎందుకు నియమించుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్లైట్ అటెండెంట్‌లుగా ఫురుషులను నియమించుకునే కంపెనీలు ఎక్కువగా శ్రమ అవసరమయ్యే పరిస్థితుల్లో మాత్రమే వారిని నియమించుకుంటాయి. చాలా విమానాల్లో క్యాబిన్ సిబ్బంది మహిళలే ఉంటారు. దీనికి పురుష, స్త్రీ క్యాబిన్ సిబ్బంది నిష్పత్తి 2/20గా ఉంటుందట.. కొన్ని ఫారిన్ ఎయిర్ లైన్స్‌లో ఈ నిష్పత్తి 4/10 కూడా ఉంటుందని అంచనా.

    Air Hostess

    Air Hostess

    Also Read: రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్లు ఇవే !

    అతిథ్యానికి సంబంధించిన పనులకు ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎందుకంటే పురుషుల కన్నా ఇందులో కొన్ని ప్రత్యేక నైపుణ్యాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణం మగవారి వారి కంటే మగువల మాటలను అందరూ శ్రద్ధగా వింటారు. సర్వీస్, నిర్వహణ విషయంలో వారు కేరింగ్‌గా ఉంటారు. మంచి నైపుణ్యాలను కలిగి ఉంటారు. పురుషులతో పోలిస్తే కాస్త ఆకర్షణీయంగా కనిపిస్తారు. వారి మాట తీరు కూడా మగవారికంటే స్వీట్‌గా ఉంటుంది.

    వీరు అందించే అతిథ్యంతో ప్రయాణికులు సంతృప్తి చెందుతారని నమ్ముతుంటారు. ప్యాసింజర్స్ ఇన్ బోర్డు అండ్ అవుట్ బోర్డు టైంలో మహిళలు ప్రత్యేకంగా వీడ్కోలు చెప్పడం ఆకర్షిస్తుంటుంది. ఇది విమానయాన సంస్థల గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళలు బరువు తక్కువగా ఉంటారు. దీంతో ఇంధనం కూడా ఆదా అవుతుంది. అందుకే చాలా సందర్భాల్లో పురుషుల కంటే మహిళలకు కొన్ని కొన్ని విభాగాల్లో ప్రత్యేకంగా ప్రయారిటీ ఇస్తుంటాయి సంస్థలు..

    Also Read: హీరోలను వదిలేసి నిర్మాతలను పట్టిన ఆ హీరోయిన్!?

    ఊ అంటావా సీఎం ఊ ఊ అంటావా 😂🤣 | AP Teachers Pushpa Parody Song on CM YS Jagan | Oktelugu

    Tags