Samantha: ‘వనిత విజయ్ కుమార్..’ వరుస పెళ్లిల రాకుమారి అని ఆమెకు ఒక బిరుదు ఇచ్చారు నెటిజన్లు. ‘వనిత చేసిన సినిమాల కంటే చేసుకున్న పెళ్లిళ్లు ఎక్కువేమో‘‘ అని ఆమె పై సెటైర్లు వేస్తుంటారు నెటిజన్లు. ఏది ఏమైనా మూడు పెళ్లిళ్లు, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, మధ్య మధ్యలో నెటిజన్లతో కామెంట్ల గొడవలు మొత్తానికి వనిత జీవన ప్రయాణం, సినీ గమనం ఇలా ఇబ్బంది కరంగా కొనసాగుతున్నా.. ఆమె మాత్రం ఎప్పుడూ సరదాగా సంతోషంగానే కాలాన్ని నెట్టుకొస్తోంది.

అయితే, తాజాగా ఈ మహా వీర వనిత, సమంత, నాగ చైతన్య విడాకుల నేపథ్యంలో సమంతకు కొన్ని సలహాలు ఇచ్చింది. భర్తతో విడిపోవడం అనే కాన్సెప్ట్ లో వనితకు ఉన్న అనుభవం మరో స్త్రీ మూర్తికి ఉండకపోవచ్చు. కాబట్టి, ఆమె మాత్రమే ఈ సమయంలో సమంతకు సలహా ఇవ్వగలదు. అందుకే ఇచ్చింది. తన మద్దతు సామ్ ఉంటుంది స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా భర్తతో విడిపోయిన ఆడవాళ్లకు తానూ నిజమైన ప్రతినిధిగా ఆమె మాట్లాడుతూ.. ‘ఈ సమాజం అనేది ఒక అవాస్తవమని.. అందుకే, ఈ సమాజాన్ని సమంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ మహా పతివ్రత అయినా వీర వనితా విజయ్ కుమార్ మాటల తూటాలు పేల్చింది. ఇక సమంత తన బతుకు తాను బతకాలని, జీవితం అనేది చాలా విలువైందని వనిత చెప్పుకొచ్చింది.

పైగా భర్తతో విడిపోవడానికి కూడా ఓ కారణం ఉంటుందని, జీవితంలో ప్రతిదీ ఎంజాయ్ చేయాలని.. అప్పుడే అన్నింటినీ జీర్ణించుకోగలమని, ఇక సమంత ధైర్యంగా తనలాగే ముందుకెళ్లాలని సూచించింది. ఇక పనిలో పనిగా సమంతకు మరింత బలం చేకూరాలని, ఆమె జీవితంలో త్వరలోనే మరో ఘట్టం రావాలని, ఆమె కొత్త అనుభూతులను ఆస్వాదించాలని వనిత విజయ్ కుమార్ కోరుకుంది.
మొత్తానికి వనితలో ఇంకా పెళ్లి ఆలోచనలు ఉన్నట్టు ఉన్నాయి. అయినా అందులో తప్పేం ఉంది అంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పబ్లిక్ గానే చెప్పింది లేండి. పాపం వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు వైఫల్యాలతో వనిత పెళ్లిల పై యుద్ధం చేసుకుంటూ పోతుంది.