https://oktelugu.com/

Aha: ‘ఆహా’ కోసం వంశీ పైడిపల్లి, సుక్కు వెబ్ సిరీస్ లు !

Aha: కరోనా ఎంత నష్టం చేసినా డిజిటల్ విప్లవాన్ని మాత్రం తీసుకొచ్చింది. కరోనా పుణ్యమా అని యువత అంతా, డిజిటల్ జనరేషన్ లా మారిపోయారు. అందుకే.. సినిమా కూడా డిజిటల్ అయిపోయింది. కరోనాకి ముందు వరకు సినిమా చూడాలి అంటే, థియేటర్స్ లోనే చూడాలి. లేకపోతే సినిమా అనుభూతి మిస్ అవుతాం అనుకున్నే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఓటీటీ మయం అయిపోయింది. అందుకే అల్లు అరవింద్ కూడా తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 23, 2021 / 06:42 PM IST
    Follow us on

    Aha: కరోనా ఎంత నష్టం చేసినా డిజిటల్ విప్లవాన్ని మాత్రం తీసుకొచ్చింది. కరోనా పుణ్యమా అని యువత అంతా, డిజిటల్ జనరేషన్ లా మారిపోయారు. అందుకే.. సినిమా కూడా డిజిటల్ అయిపోయింది. కరోనాకి ముందు వరకు సినిమా చూడాలి అంటే, థియేటర్స్ లోనే చూడాలి. లేకపోతే సినిమా అనుభూతి మిస్ అవుతాం అనుకున్నే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఓటీటీ మయం అయిపోయింది.

    Vamsi Paidipally and Sukumar

    అందుకే అల్లు అరవింద్ కూడా తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి ఇప్పటికే చాలా కసరత్తులు చేశాడు. ఏకంగా బాలయ్యతో ఓ షోనే చేయిస్తున్నాడు. అలాగే చాలా మంది దర్శకులతో డిఫరెంట్ డిఫరెంట్ వెబ్ సిరీస్ లు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే సుకుమార్ తో కూడా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడు.

    కాగా ఈ సిరీస్ కి ఇప్పుడు టైం వచ్చింది. ‘ఆహా’ కోసం సుకుమార్ ఓ భారీ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. నిజానికి పుష్ప కంటే ముందు సుకుమార్ ఆహాలో ఓ వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. స్క్రిప్టు కూడా పూర్తి చేశాడు. కానీ బ‌డ్జెట్ ఎక్కువ అవ్వ‌డం వ‌ల్ల‌ అప్పుడు ఆ వెబ్ సిరీస్ పోస్ట్ ఫోన్ అయింది. కాగా ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నారు.

    అయితే, ఈ సిరీస్ కి సుకుమార్ ద‌ర్శ‌కుడు కాడు. కానీ, వెబ్ సిరీస్ కి క‌థ‌. స్క్రీన్ ప్లే, మాట‌లు అందిస్తున్నాడు. కథ విషయానికి వస్తే జీరో నుంచి హీరోగా ఒక సామాన్య వ్యక్తి ఎలా మారాడు ? అనేది మెయిన్ పాయింట్. పుష్ప కూడా ఇదే పాయింట్. ఇక ఈ సిరీస్ లో ఓ ప్ర‌ముఖ హీరో న‌టిస్తాడ‌ట. అన్నట్టు డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాడు.

    Also Read: Nani: నాని వ్యాఖ్యల వల్ల స్టార్ హీరోలకే ఇబ్బంది !

    గత దీపావళి నాడు అధికారికంగా అల్లు అర్జునే స్వయంగా ఈ వెబ్ సిరీస్ గురించి ప్రకటించాడు. ఈ వెబ్ సిరీస్ కోసం వంశీ ఒక కథ రాశాడు. మరి ఈ సిరీస్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే, వంశీ పైడిపల్లి తమిళ స్టార్ విజయ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

    Also Read: Bollywood Actors: సౌత్ లో రాణిస్తున్న బాలీవుడ్ నటులు.. హవా మాములుగా లేదుగా..

    Tags