KCR: గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఓ వార్త బాగా సంచలనం రేపుతోంది. ఇంకా చెప్పాలంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఇది ఊపందుకుంది. అదే ముందస్తు ఎన్నికలు. 2018లో కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి సంచలన విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అలాంటి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్రమక్రమంగా బీజేపీ బలపడటంతో ఎలాగైనా గెలిచి గట్టెక్కాలంటే ముందస్తు వ్యూహమే బెటర్ అని భావిస్తున్నారంట.
ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీలోని సర్వే టీమ్‌లను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2023లో తెలంగాణలో ఎన్నికలు రావాలి. కానీ ముందస్తుకు వెల్తే మాత్రం వచ్చే ఏడాదే జరిగే ఛాన్స్ ఉంటుంది. నిన్న మొన్నటి దాకా ఈ మాటలు కేవలం తెలంగాణలోనే వినిపించేవి. కానీ ఇప్పుడు ఢిల్లీ బాస్ అయిన అమిత్ షా కూడా వీటిని బలపరుస్తున్నారు. దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న అమిత్ సాకు చాలా స్ట్రాంగ్ సోర్స్ ఉంటే తప్ప అలాంటి మాటలు మాట్లాడరు.
ఇప్పుడు బీజేపీ మంచి ఫామ్ లో ఉంది. బలమైన నేతలు అందరూ ఆ పార్టీకి క్యూ కడుతున్నారు. ఇక రేవంత్ హయాంలో కాంగ్రెస్ కూడా దూకుడు పెంచేసింది. కాబట్టి ఈ రెండు పార్టీలను ఎదగనీయకుండా ముందస్తుకు వెళ్లి మరోసారి సీఎం కుర్చీ మీద కూర్చోవాలని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారంట. కానీ ఇలా ముందస్తుకు వెల్తే మాత్రం చివరకు కేసీఆర్ కే నష్టం జరుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కేసీఆర్ ప్రకటించిన చాలా పథకాలు ప్రజలకు చేరలేదు.
Also Read: Hyderabad: హైదరాబాద్ లో లేక్ వ్యూ క్యాంప్ ఆఫీసు ముస్తాబులో ఆంతర్యమేమిటో?
ఇక మొన్న ప్రకటించిన దళిత బంధు కూడా ఇంకా ఒక్క నియోజకవర్గంలో కూడా పూర్తి కాలేదు. వచ్చే ఏడాది ఎన్నిలకు వెళ్తే ఆ లోపు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఇక దళిత బంధును పెడితే బీసీ, మైనార్టీ బంధులు కూడా పెట్టాలని ఒత్తిడి రావడం ఖాయం. ఆ వర్గాలకు స్కీమ్ పెట్టకపోతే చివరకు కేసీఆర్‌కు షాక్ తప్పదు. ఇవే కాకుండా కొత్త పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లాంటి మేజర్ స్కీములు అమలు చేయకుండా ముందస్తుకు వెళ్తే మాత్రం కేసీఆరే నష్టపోతారని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Revanth Reddy: రేవంత్ సీరియస్ గా తీసుకుంటేనే ఛాన్స్.. లేదంటే?