
Nithiin- Vakkantham Vamsi: ఈమధ్య సినిమా తీయడం పెద్ద సమస్య కావడం లేదు. ఆ సినిమాకు మంచి టైటిల్ ను వెతకడం కష్టంగా మారింది. అందుకే కొన్నింటికి పాత సినిమాల పేర్లను రిపీట్ చేస్తున్నారు. అప్పుడు ఆ పేర్లతో సినిమాలు హిట్టు కొట్టడంతో అవే తీసుకొని ఇప్పటి సినిమాలకు బజ్ తెప్పిస్తున్నారు. అయితే ఇటీవల కొందరు టైటిల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కేవలం మూడుకు మించి పదాలు ఉండకుండా నిర్ణయిస్తున్నారు. ఇవి పొగడ్తలైనా, తిట్లైనా పర్వాలేదు. జనాల్లోకి వెళ్తుందా? లేదా? అని చూస్తున్నారు. అలా టెంపర్, పాగల్, ధమాకా వంటి పేర్లు ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోయాయి. సినిమా సంగతి ఎలా ఉన్న టైటిల్స్ ప్రేక్షకులను రప్పించాయి అన్న చర్చ సాగింది. తాజాగా నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్లో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమాకు ‘సైతాన్’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం.
‘సైతాన్’ పేరుతో యూట్యూబ్ లో పలు ప్రోగ్రామ్స్ , షార్ట్ ఫిలింస్ ఉన్నాయి. కానీ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు పెట్టలేదనే తెలుస్తోంది. దీంతో ‘సైతాన్’ టైటిల్ బాగా వర్కౌట్ అవుతుందని వక్కంతం వంశీ భావిస్తున్నారు. అయితే ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ జనాల్లోకి టైటిల్ సినిమాను తీసుకెళ్తుందని అనుకుంటున్నారు. సైతాన్ అంటే మన భాషలో దయ్యం అంటాం. అంటే సినిమా హర్రర్ నేపథ్యంలో ఉంటుందా? లేక విలనిజం ఎక్కువగా ఉంటుందా? అని అనిపిస్తోంది. సినిమాలో రొటీన్ గా హీరోయిజం చూపించేకంటే విలనిజానికే ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే సైతాన్ కు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని వక్కంతం వంశీ అంటున్నారు.

వక్కంతం వంశీ రచయితగా సినీ ఫీల్డు ఎంట్రీ ఇచ్చారు. టెంపర్ చిత్రానికి కథను అందించారు. ఆయన డైరెక్షన్లో అల్లు అర్జున్ తో ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా తీశారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా కొన్ని సినిమాలకు టైటిల్ ఈయనే అందించారని అంటున్నారు. ఇప్పుడు సైతాన్ ను కూడా బాగా ఆలోచించి డిసైడ్ అయ్యారని అంటున్నారు. వక్కంతం వంశీ నటుడిగా, రచయితగా పలు సినిమాల్లో పనిచేశారు. అయితే స్టార్ డమ్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు.
ఇటు నితిన్ కు చాలా రోజులుగా బ్లాక్ బస్టర్ లేదు. ఇప్పుడీ టైటిల్ తో తనకు మరోసారి పాతరోజులు వస్తాయని నుకుంటున్నారు. దీంతో సైతాన్ టైటిల్ పేరు వినిపించగానే సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ టైటిల్ బాగా ఉంటుందని కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు షార్ట్ లిస్టులో పెట్టిన టైటిళ్లలో సైతాన్ ఒకటి. దీంతో ఈ టైటిల్ నెగెటివ్ ఫీడ్ వస్తుందా? అని అనుకుంటున్నారు.