
Pooja Hegde: నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు ఇప్పుడు అకస్మాత్తుగా మాయం అయ్యిపోతున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది పూజా హెగ్డే గురించి. గత దశాబ్ద కాలం నుండి ఈ సౌత్ లో ఈ హాట్ బ్యూటీ హవా ఏ రేంజ్ లో కొనసాగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వరుసగా స్టార్ హీరోల సరసన నటించి అనతి కాలంలోనే పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమెకి రీసెంట్ గా వచ్చిన వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ఆమెని ఒక్కసారిగా క్రిందకి లాగేసింది.
మిగిలిన ఇండస్ట్రీలలో ఈమె ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చెప్పలేము కానీ, ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు రాకుండా చేస్తుంది మాత్రం ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ అని తెలిసింది. ఆ స్టార్ డైరెక్టర్ ఈమె తో చాలా కాలం నుండి ఎఫైర్ నడుపుతున్నాడని. అందుకే వరుసగా తాను తీసే సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడని ఎప్పటి నుండో ఈ న్యూస్ ప్రచారం అవుతున్నదే.
అయితే లేటెస్ట్ గా వచ్చిన ఇద్దరు కుర్ర హీరోయిన్ల మోజులో పడి ఇతను పూజ హెగ్డే ని పూర్తిగా పక్కన పెట్టేసాడని.తనకి అందుబాటులో ఉన్న సన్నిహిత డైరెక్టర్స్ కి కూడా ఈ ఇద్దరు హీరోయిన్స్ ని రికమెండ్ చేసి వరుసగా అవకాశాలు ఇప్పిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు. ఆ క్రమం లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో ముందుగా పూజ హెగ్డే ని తీసుకున్న వాళ్ళు కూడా ఆమెని పక్కన పెట్టేశారట. ఇందుకు పూజా హెగ్డే బాగా హర్ట్ అయ్యినట్టు సమాచారం.

నటన మీద కాకుండా కేవలం అందం మీదనే ద్రుష్టి పెడితే ఏ హీరోయిన్ కెరీర్ అయినా చివరికీ ఇలాగే అవుతుంది. అందుకు గతం లో మనం ఎన్నో ఉదాహరణలు చూసాము. ఇప్పుడు పూజా హెగ్డే ని చూస్తాము.కొత్త అందాలు ఇండస్ట్రీ లోకి వస్తే వాళ్ళ దాటికి నిలబడలేరు. నమ్మిన వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తారు అనేందుకు ఇది ఒక ఉదాహరణ.ఇక నుండి అయినా పూజ హెగ్డే నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తుందో లేదో చూడాలి.