
ఒక సినిమా హిట్ కావాలంటే ఎంతో మంది కష్టం ఉంటుంది. హిట్ అయితేనే వారికి క్రెడిట్. హిట్ కాకపోతే అధ: పాతాళానికి పడిపోతారు. ఇప్పుడు జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన దర్శకుడు అనుదీప్ కష్టాలు కూడా కన్నీళ్ల మయమే..
‘జాతిరత్నాలు’ సినిమా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లు నటించిన ఈ సినిమాకు అనుదీప్ డైరెక్టర్. మొదటి సినిమా ‘పిట్టకథ’తో ప్లాప్ అందుకున్న ఈయన రెండో సినిమాకే స్టార్ డైరెక్టర్ గా మారాడు.
‘జాతిరత్నాలు’ సినిమా డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాలను ఏదో ఒకరోజు రాసుకున్న కథ ఆధారంగా తీసిన సినిమా కాదు. ఎన్నో ఏళ్ల శ్రమ, కష్ట నష్టాల సుడిగుండం నుంచి బయటకొచ్చిన తరువాత చివరికీ ఈ సినిమా విజయం సాధించిందని అనుదీప్ స్నేహితుడు తన ఫేస్ బుక్ ఖాతాలో చెప్పాడు. అనుదీప్ స్నేహితుడు కిట్టుపోలు తమ సినిమా కష్టాల గురించి ఓ స్టోరీయే రాశాడు.
జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కు సక్సెస్ ఊరికే రాలేదు. దీనివెనుక తన 17 ఏళ్ల నిరీక్షణ ఉంది. కష్టాలున్నాయి. కన్నీళ్లున్నాయి. అప్పులు, ఆకలిబాధలు, ప్రేమలు, త్యాగాలున్నాయి..
అనుదీప్ తిండిలేక పస్తున్న రోజులు ఉన్నాయట.. రూ.5 టికెట్ తో సినిమాలు చూసి సినిమాలంటే ప్రేమ ఫ్యాషన్ తో ఆకలి బాధలు దిగమింగాడట.. అతడి స్నేహితుడు చేసిన ఫేస్ బుక్ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.