spot_img
Homeఎంటర్టైన్మెంట్ఎక్స్ క్లూజివ్ : వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

ఎక్స్ క్లూజివ్ : వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్ !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నారు మేకర్స్. కేవలం పది రోజులు షూట్ చేస్తే.. ఈ సినిమా పూర్తయిపోతోంది. అందుకే ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలనేది దిల్ రాజు ప్లాన్. పవన్ షూట్ పై ఆసక్తిగా లేకపోయినా.. దిల్ రాజు రిక్వెస్ట్ తో షూట్ లో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాగూ 2021 జనవరి నాటికి థియేటర్లు తెరుస్తాయని స్పష్టమవుతోంది.

Also Read: అక్టోబర్ 2న ‘నిశ్శబ్దం’గా అనుష్క రాబోతోంది !

అందుకే దిల్ రాజు ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 14న పెద్ద ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దసరాకి అధికారికంగా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు. మొత్తానికి సంక్రాంతి సూపర్ స్పెషల్‌గా పవన్ సినిమా ఉండబోతుంది. ఇక పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అయితే కమర్షియల్ సినిమా కాదు ఇది, పైగా ఎంటర్ టైన్మెంట్ కూడా ఈ సినిమాలో ఉండదు అనేది ఇప్పటికే టాక్ బయటకు వచ్చేసింది. మరి ఈ సినిమా పై పవన్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకుంటే… అది ఓవర్ హైప్ క్రియేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

Also Read: హైపర్ ఆదిని చితకబాదిన దొరబాబు భార్య..!

అయితే సినిమా బాగుంది అని రిపోర్ట్స్ బయటకు వస్తే మాత్రం.. పవర్ స్టార్ రీఎంట్రీతో టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేయడం గ్యారంటీ. అలాగే పవన్ శైలి నటనను మరోసారి వెండితెరపై చూడాలనే ఫ్యాన్స్ ఆశ కూడా ఈ సినిమాతో తీరుతుంది. కానీ, పవన్ ఇదివరకు చేసినట్లు డాన్స్ లు అండ్ రొమాన్స్ చేసే పరిస్థితి ఈ సినిమాలో లేదు గనుక, సీరియస్ డ్రామాకి ఫ్యాన్స్ కూడా మానసికంగా సిద్ధ పడితే బెటర్. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా పై కూడా పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ బాగా నిరుత్సాహ పడ్డారు. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా పై కూడా ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
Oktelugu Epaper