https://oktelugu.com/

వకీల్‌ సాబ్‌లో పవన్‌ కళ్యాణ్‌ లాయర్ స్టిల్‌ లీక్‌..

రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇంత విరామం తర్వాత ఆయన వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పవర్ స్టార్ లేటెస్ట్ ప్రాజెక్ట్ వకీల్ సాబ్. బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బోనీ కపూర్తో కలిసి దిల్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2020 / 04:09 PM IST
    Follow us on


    రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇంత విరామం తర్వాత ఆయన వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పవర్ స్టార్ లేటెస్ట్ ప్రాజెక్ట్ వకీల్ సాబ్. బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బోనీ కపూర్తో కలిసి దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    సాధారణంగా పవన్‌ మూవీ అంటే ఇండస్ట్రీలో భారీ క్రేజ్‌ ఉంటుంది. లాంగ్‌ బ్రేక్‌ తర్వాత వస్తున్నది కాబట్టి ‘వకీల్‌ సాబ్‌’పై అందరి దృష్టి నెలకొంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన పవన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, ఫస్ట్‌ సింగిల్.. మగువా మగువా (లిరికల్‌ వీడియో)కు విపరీతమైన స్పందన వచ్చింది. దాంతో మూవీపై క్రేజ్‌ అమాంతం పెరిగింది. లాక్‌డౌన్‌ సడలింపులు రావడంతో షూటింగ్‌ తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇలాంటి టైమ్‌లో చిత్ర యూనిట్‌కు తగిలింది. ఈ మూవీలో కోర్టు సీన్ ఫొటో లీక్ కావడం చర్చనీయాంశమైంది.

    లాయర్ పాత్రలోని పవన్‌ నల్ల కోటుతో నిలుచొని వాదనలు వినిపిస్తున్న ఫొటో నెట్‌లో వైరల్‌గా మారింది. ఫొటోలో పవన్‌ ఎడమవైపు అంజిలి కూర్చుని ఉంది. ఫొటోపై ఉన్న వాటర్ మార్క్‌ చూస్తుంటే… వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ జరుగుతుండగా ఈ ఫొటోను లీక్‌ చేసినట్టు అర్థమవుతోంది. దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.