https://oktelugu.com/

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న ఆయనకు అన్ని విధాలా కలిసొస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరకు కేసీఆర్ మాటే నెగ్గుతోంది. తాజాగా హైకోర్టులోనూ కేసీఆర్ తన పంతం నెగ్గించుకోవడం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర విడిపోయాక కొన్ని రోజుల నుంచి సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మాణం చేయాలని సంకల్పించారు. దీనిని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో తొలి నుంచి ప్రభుత్వ వాదనను వ్యతిరేకించినా హైకోర్టు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2020 / 04:21 PM IST
    Follow us on


    తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న ఆయనకు అన్ని విధాలా కలిసొస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరకు కేసీఆర్ మాటే నెగ్గుతోంది. తాజాగా హైకోర్టులోనూ కేసీఆర్ తన పంతం నెగ్గించుకోవడం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర విడిపోయాక కొన్ని రోజుల నుంచి సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మాణం చేయాలని సంకల్పించారు. దీనిని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో తొలి నుంచి ప్రభుత్వ వాదనను వ్యతిరేకించినా హైకోర్టు తాజాగా సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

    హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

    టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ సచివాలయంలో అడుగుపెట్టలేదు. కేసీఆర్ తొలి నుంచి వాస్తు, న్యూమరాలజీ, జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారని తెలంగాణలోని ప్రతీఒక్కరికి తెల్సిందే. ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయం వాస్తుపరంగా ఆయనకు కలిసి రాదనే కొందరు పండితులు ఆయనకు సూచించినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆయన పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని భావించారనే టాక్ రాజకీయవర్గాల్లో విన్పించింది. ఇందులో వాస్తవం ఎంతుందోగానీ మొత్తానికి పాత సచివాలయాన్ని కూల్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు. ఈమేరకు కొత్త సచివాలయ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో సచివాలయం కూల్చివేతకు బ్రేక్ పడింది.

    ఇప్పుడున్న సచివాలయం కూల్చివేయడం వల్ల వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని దాదాపు పది పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. కొన్నినెలలుగా దీనిపై హైకోర్టు విచారణ చేపడుతోంది. తొలినాళ్లలో ప్రభుత్వం తీరును హైకోర్టు తప్పుబట్టింది. అయితే సోమవారం ప్రభుత్వం తన వాదనలను బలంగా విన్పించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వాస్తు వంటి అంశాలను చూపకుండా సాంకేతికపరమైన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లి విజయవంతంమైనట్లు సమాచారం. సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు తిరగడానికి కూడా స్థలం లేదని కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వ వాదనకు మద్దతుగా ఫైర్ డిపార్ట్ మెంట్ సర్టిఫికెట్ కోర్టు ముందుంచింది. సాంకేతికంగా ఏయే లోపాలు ఉన్నాయో ప్రభుత్వం కమిటీ నియమించి దాని నివేదిక ఆధారంగా పనులు చేపడుతున్నట్లు కోర్టుకు తెలిపింది.

    పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

    అంతేకాకుండా ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో హైకోర్టుకు జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టంగా తెలిపింది. దీనిపై సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని ప్రభుత్వం హైకోర్టులో తన వాదన విన్పించింది. ప్రభుత్వ వాదనకు బలం చేకూరడంతో హైకోర్టు తీర్పుకు సర్కారుకు అనుకూలంగా వచ్చింది. దీంతో కొత్త సచివాలయం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. పాతసచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలనే కేసీఆర్ పంతం నెగ్గడంతో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణలో ఎదురులేదని మరోసారి హైకోర్టు తీర్పు ద్వారా వెల్లడైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.