https://oktelugu.com/

100 కోట్ల క్లబ్ లో మెగా మేనల్లుడు !

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ అనే చిన్న చిత్రంతో మొత్తానికి 100 కోట్లు క్లబ్ లో జాయిన్ అయ్యేలా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని సుకుమార్ అన్నప్పుడు అందరూ ఫన్నీగా తీసుకున్నారు గానీ, ఇప్పుడు వస్తోన్న కలెక్షన్స్ ను చూస్తుంటే పెదవి విరిచిన వారే షాక్ కి గురవుతున్నారు. ఏది ఏమైనా ఎవ్వరూ ఊహించని విధంగా సినిమా కళ్ళు చెదిరే హిట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో […]

Written By:
  • admin
  • , Updated On : February 27, 2021 / 03:32 PM IST
    Follow us on


    మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ అనే చిన్న చిత్రంతో మొత్తానికి 100 కోట్లు క్లబ్ లో జాయిన్ అయ్యేలా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని సుకుమార్ అన్నప్పుడు అందరూ ఫన్నీగా తీసుకున్నారు గానీ, ఇప్పుడు వస్తోన్న కలెక్షన్స్ ను చూస్తుంటే పెదవి విరిచిన వారే షాక్ కి గురవుతున్నారు. ఏది ఏమైనా ఎవ్వరూ ఊహించని విధంగా సినిమా కళ్ళు చెదిరే హిట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ హిట్ అయిన సినిమా బహుశా ఉప్పెన ఒక్కటే. క్రాక్ కి హిట్ టాక్ వచ్చినా గొప్పగా కలెక్షన్స్ రాలేదు.

    Also Read: సంక్రాంతికి టగ్ ఆఫ్ వార్‌.. బ‌రిలో ప‌వ‌న్ – మ‌హేష్‌..?

    అయితే తాజాగా ఉప్పెన సినిమా ఇప్పటికే 44 కోట్లు షేర్ ను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కలెక్ట్ చేసింది. అంటే దాదాపుగా 70 కోట్ల గ్రాస్ వచ్చింది అన్నమాట. ఇక సినిమా కలెక్షన్స్ మొత్తం క్లోజ్ అయ్యేనాటికి 100 కోట్ల గ్రాస్ రావొచ్చు అనేది ట్రేడ్ వర్గాల నమ్మకం. ఇప్పటికే రెండు వారాల నుండి ఈ సినిమా ఊపేస్తోంది. పైగా ఈ వీకెండ్ కూడా ఈ సినిమా రన్ బాగానే ఉండేలా కనిపిస్తోంది. నితిన్ నటించిన ‘చెక్’, అల్లరి నరేష్ ‘నాంది’ మినహా మిగతావేవీ ఉప్పెనకు పోటీ ఇచ్చేలా లేవు. ఈ సినిమాలో నటించిన హీరో వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నాడు అంటేనే ఉప్పెన ఇచ్చిన ఉత్సాహాన్ని అర్ధం చేసుకోవచ్చు.

    Also Read: ‘ఉప్పెన’ హీరోయిన్ తో సుధీర్ ప్రేమ

    ఆల్ రెడీ హీరోయిన్ కృతి శెట్టి ఇప్పటికే పెద్ద హీరోయిన్ గా మారిపోయింది. దర్శకుడు బుచ్చిబాబు రెండో సినిమా కూడా మైత్రి బ్యానర్లోనే భారీ బడ్జెట్ తో తీయబోతున్నాడు. స్టార్ హీరోనే సెట్ చెయ్యాలని మైత్రి సంస్థ ప్రయత్నిస్తోనట్లు సమాచారం. లవ్ స్టోరీ చిత్రాలకు ‘ఉప్పెన’ ఊపిరినిచ్చిందనే చెప్పాలి. అలాగే, ఇప్పుడు మ్యూజిక్ అనేది ఒక సినిమా సక్సెస్ కి ఎంత ఇంపార్టెంట్ గా మారిందో మరోసారి ప్రూవ్ చేసింది ఉప్పెన. ఆ ఘనత ఒక్క దేవికే దక్కుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్