https://oktelugu.com/

Vaishnav Tej: ప్చ్.. విలన్ వేషాలు వేస్తున్న మెగా హీరో !

Vaishnav Tej: మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగానే చేయాలి, లేదా ఫలానా క్యారెక్టర్స్ మాత్రమే చేయాలి లాంటి కండిషన్స్ ఏమి పెట్టుకోలేదట. ఒక్క ఉప్పెన మినహా మరో హిట్ ఇవ్వలేకపోయాననే బాధ వైష్ణవ్ తేజ్ కి ఎక్కువ ఉందట. పైగా తన మార్కెట్ ఏమిటి ? తన రేంజ్ ఏమిటి ? లాంటి విషయాల్లో తనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే.. తానేదో స్టార్ అనే ఫీలింగ్ లో తానూ ఎప్పుడూ లేను అని […]

Written By:
  • Shiva
  • , Updated On : April 22, 2022 / 07:32 PM IST
    Follow us on

    Vaishnav Tej: మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగానే చేయాలి, లేదా ఫలానా క్యారెక్టర్స్ మాత్రమే చేయాలి లాంటి కండిషన్స్ ఏమి పెట్టుకోలేదట. ఒక్క ఉప్పెన మినహా మరో హిట్ ఇవ్వలేకపోయాననే బాధ వైష్ణవ్ తేజ్ కి ఎక్కువ ఉందట. పైగా తన మార్కెట్ ఏమిటి ? తన రేంజ్ ఏమిటి ? లాంటి విషయాల్లో తనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే.. తానేదో స్టార్ అనే ఫీలింగ్ లో తానూ ఎప్పుడూ లేను అని చెబుతున్నాడు వైష్ణవ్ తేజ్.

    Vaishnav Tej

    అయితే, ఎప్పటికైనా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకుంటాను అని వైష్ణవ్ తేజ్ చెబుతున్నాడు. అందుకు తగ్గట్టు ప్రయత్నిస్తున్నానని కూడా వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఇటీవల విడుదలైన ‘కొండపాలెం’ సినిమా అపజయం పాలైంది, అలాగే వైష్ణవ్ తేజ్ నటన కూడా బాగాలేదు అని విమర్శలు వినిపించాయి.

    Also Read: Chandini Chowdary: ఛాన్స్ ల కోసం అన్ని చేస్తానంటున్న తెలుగు హీరోయిన్ !

    అందుకే ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో ప్రత్యేక నటనతో ఆకట్టుకోవాలని వైష్ణవ్ తేజ్ తెగ కష్టపడుతున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తోన్న కొత్త సినిమా కోసం డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నాడట. ఇక ఈ సినిమా చాలా ప్రామిసింగ్గా ఉంటుందట. మొత్తానికి హీరోగా రాణించేందుకు వైష్ణవ్ తేజ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు.

    Vaishnav Tej

    అలాగే ఒక్క హీరో పాత్రలకే పరిమితం అవ్వకూడదు అని కూడా వైష్ణవ్ తేజ్ డిసైడ్ అయ్యాడు. హీరోగా చేస్తూనే.. మరోపక్క వైవిధ్యమైన పాత్రలు కూడా చేస్తానంటున్నాడు. మొత్తమ్మీద ఈ యంగ్ హీరో.. హీరో వేషాలతో పాటు విలన్ వేషాలు కూడా వేయాలని ఆశ పడుతున్నాడు.

    కానీ, ఈ విలన్ వేషాల్లో కొన్ని పరిమితులు ఉన్నాయట. తాను మెయిన్ లీడ్ గా చేసే సినిమాల్లోనే విలన్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తానని.. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో కూడా విలన్ వేషాలు వేస్తానని వైష్ణవ్ తేజ్ చెబుతున్నాడు. మరి వైష్ణవ్ తేజ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

    Also Read:Pooja Hegde: సమంత కంటే ‘పూజా హెగ్డే’ రేటు 50 లక్షలు ఎక్కువ !

    Recommended Videos:

    Tags