Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham : ముద్రగడ చనిపోయే ముందు కూతురు గురించి మాట్లాడిన ఈ వీడియో చూస్తే...

Mudragada Padmanabham : ముద్రగడ చనిపోయే ముందు కూతురు గురించి మాట్లాడిన ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..

Mudragada Padmanabham : ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులూ , అజాత శత్రువు , ముద్రగడ పద్మనాభం నిన్న హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ఘటన , ఆయన అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులూ , వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ముద్రగడ అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతే కాదు , జగన్ స్వయంగా ముద్రగడ పాడెని కూడా మోశారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే అంత్యక్రియ కార్యక్రమం లో అనేక నాటకీయ సంఘటనలు జరిగాయి. ముద్రగడ కూతురు క్రాంతి తన తండ్రి ని చివరి చూపు చూసేందుకు రాగా ఆమెని వైసీపీ నాయకులూ అడ్డుకున్నారు. చివరికి ఆమె తల్లి , కొడుకు కూడా ముద్రగడ పార్థివ దేహాన్ని చూసేందుకు అనుమతించలేదు.

చివరికి ఆమె తన తండ్రిని చివరి చూపు చూడకుండానే వెనుతిరిగినట్టు సమాచారం. అయితే ముద్రగడ బ్రతికి ఉన్న రోజుల్లో తన కూతురు గురించి మీడియా ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముద్రగడ మాట్లాడుతూ ‘ఎదో ఇప్పుడు నా మీద ప్రేమ తెగ చూపించేస్తున్నారు. అన్నీ గుర్తు ఉన్నాయ్. గతంలో మనస్పర్థలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చింది. హైదరాబాద్ లో సర్జరీ చేయించాము. 15 రోజులు హాస్పిటల్ లో ఉన్నాము , 10 రోజుల తర్వాత కీమో థెరపీ చేస్తానని డాక్టర్ చంద్రశేఖర్ గారు చెప్తే , ఈ వెదవుల (కూతురు క్రాంతి , అల్లుడు) ఇంటికి వచ్చాను. ఈ వెదవలు 5 నిమిషాలు కూడా లోపల ఉండడానికి వీలు లేదని అన్నారు మమ్మల్ని. వీళ్ళ మా మీద ఈరోజు ప్రేమ చూపిస్తారా ?’.

‘మొగుడు పెళ్ళాం ఇద్దరూ మా ఇంటికి రావొద్దు అని తెగేసి చెప్తే , హైదరాబాద్ లోని బ్రాహ్మీన్స్ సుధాకర్ ఇంటికి తీసుకెళ్తే అక్కడ రెండు రోజులు ఉండి బయలుదేరాము. నేడు వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది , చిన్నోడు వైద్యం చేయించడం లేదు , ఎవ్వరూ పట్టించుకోవడం లేదని నాటకాలు చేస్తున్నారు. బాష కూడా మారిపోయింది చూసారా నాది?, తట్టుకోలేక ఇలా అయ్యాను. మన మధ్య రాకపోకలు ఆగిపోయి చాలా రోజులు అయ్యిందే , ఇప్పుడు మళ్లీ నన్ను ఎందుకు రోడ్డు మీదకు లాగుతున్నారు?, మీరు టార్గెట్ చేస్తే నేను బెదిరిపోతానా? ‘ అంటూ ఆవేదనతో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version