ABN RK KomatiReddy: తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష కోట్ల స్కాంకు ఆధారాలున్నాయని.. ఆయన అధికారం కోల్పోయిన మరుక్షణం జైలుకు పోవడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పెద్దల వద్ద ఈ ఫైల్ ఉందని.. ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కేసీఆర్ కు చిక్కులు తప్పవని అన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సునిశిత ప్రశ్నలకు కోమటిరెడ్డి ఆసక్తికర సమాధానాలిచ్చారు.

తరచూ కాంగ్రెస్ పార్టీ మారుతారన్న వార్తలపై కూడా కోమటిరెడ్డి సమాధానం ఇచ్చారు. తాను పుట్టింది కాంగ్రెస్ లోనని.. పెరిగింది కాంగ్రెస్ లోనని.. చచ్చేది కూడా ఇదే పార్టీలోనని స్పష్టం చేశారు. తన జీవితం ఆశయం కేసీఆర్ ను గద్దెదింపడమని చెప్పుకొచ్చారు.
టీపీసీసీ చీఫ్ పదవి రాకపోవడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గాంధీభవన్ గడప తొక్కనన్న వెంకటరెడ్డి ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. తనతోపాటు సీనియర్లు చాలా మంది టీపీసీసీ చీఫ్ పదవిని ఆశించారని.. తమను కాదని ఇతర పార్టీలోని జూనియర్లకు ఇవ్వడాన్నే సహించలేక అలా అన్నామని కోమటిరెడ్డి అన్నారు.
కేసీఆర్ సహా బీజేపీ నుంచి పార్టీలోకి రావాలని ఎన్నో ఆహ్వానాలు, ఆఫర్లు వచ్చాయని.. తనను కౌగిలించుకొని సన్నిహితంగా ఉండడాన్ని చూసి అందరూ తాను పార్టీ మారుతున్నానని అనుకున్నారని కోమటిరెడ్డి అన్నారు.
ఇక తనకు తన తమ్ముడు తీరుతో నష్టం జరిగిందని.. పార్టీ మారే వాళ్లను రాళ్లతో కొట్టి పిచ్చోళ్లలాగా చేయాలని.. వారికి టికెట్లు ఇవ్వవద్దని కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? రాదో తెలియకుండానే సీఎం సీటు కోసం 12 మంది పోటీలో ఉంటారని.. అలాంటి పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని ప్రశ్నకు ఆసక్తిగా స్పందించారు. కనీసం ఒక పదివేల ఓట్లు కూడా సంపాదించుకోలేని నేతలు కూడా సీఎంలుగా అనుకుంటున్నారని.. కనీసం ఒక కుటుంబం ఓట్లు కూడా వాళ్లు సంపాదించలేరని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీతో కేసీఆర్ ఫైట్ అన్నది నాటకం అని.. బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని.. కాంగ్రెస్ ను ఓడించేందుకే ఈ కథ అంతా అని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యంఠాగూర్ సైతం టీఆర్ఎస్ తో పొత్తు లేదని కాంగ్రెస్ నేతల్లో అనుమానాలకు బీజం పోస్తున్నాడని సొంతపార్టీ అధినేతను సైతం కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ ను జైలుకు పంపడమే ధ్యేయమని.. అవినీతి చేస్తే అధికారి అయినా ఎవడైనా జైలుకు వెళ్లాల్సిందేనని.. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ పని చేస్తామని కేసీఆర్ కు కోమటిరెడ్డి సంచలన హెచ్చరికలు పంపారు. ఢిల్లీలో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతిపై ఆధారాలు పెండింగ్ లో ఉన్నాయని ఎవరు ఆపుతున్నారో తెలియడం లేదని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణలో ఎలుకలు కొరికి చచ్చిపోతుంటే బయట పరువు పోతోందని కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు.
ఆయన అభిప్రాయాలతో కూడిన ప్రోమో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. పెనుదుమారం రేపుతోంది. దాని ఫుల్ ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం కానుంది. అప్పటివరకూ కోమటిరెడ్డి ఏం చెప్పారు? ఎలాంటి సంచలనాలు బయటపెట్టాడన్న పూర్తి ఎపిసోడ్ ను అందులో చూడొచ్చు.

[…] KTR: దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విమర్శల వెల్లువ కొనసాగుతోంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య వైరుధ్యాలు పెరుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైనే విమర్శల దాడి చేస్తోంది. ఈ మేరకు మోడీని గాడ్సే భక్తుడిగా తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు అడపాదడపా మాటలనుకున్న నేతలు ఇప్పుడు ప్రత్యక్ష దాడులకే మొగ్గు చూపడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానమంత్రినే టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ దాడి చేయడం వెనుక అంతర్మథనం ఏం దాగుంటుందనే ఆలోచన అందరిలో వస్తోంది. ఈ మేరకు కేటీఆర్ ప్రధాని మోడీపై ఇంత దారుణంగా విరుచుకుపడ్డారంటే ఏదో జరిగే ఉంటుందనే వాదనలు వస్తున్నాయి. […]
[…] Minister Buggana: ఒకటో తారీఖు వచ్చిందంటే చాలూ ఏపీ ప్రభుత్వం వణికిపోతోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడం ఎలా అని మార్గాలు వెతకాల్సి వస్తోంది. నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలకు శ్రుతిమించి ఖర్చు చేయడంతో రాష్ట్రం అప్పులబారిన పడక తప్పడం లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనన్ని అప్పులు చేసి కేంద్ర ప్రభుత్వం వద్ద పలుచన అవుతోంది. ప్రతీ నెలా మూడో వారమే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీకి క్యూకడుతున్నారు. కొత్త అప్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోసం వెంపర్లాడుతున్నారు. గత మూడేళ్లుగా ఇదో పరిపాటిగా మారిపోయింది. అప్పులిచ్చేందుకు బ్యాంకులు సైతం ముఖం చాటేస్తున్నాయి. […]
[…] […]
[…] Somu Veerraju: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అందివచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సంఖ్యాబలంలో ముందున్నాయే తప్ప అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొన లేకపోతున్నాయి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీది వింత పరిస్థితి. ప్రజాక్షేత్రంలో అధికార పార్టీతో తలపడాల్సిన ప్రతీసారి ఏదో కుంటి సాకుతో తప్పించుకుంటోంది. రకరకాల కారణాలు చెప్పి పోటీ నుంచి తప్పుకుంటోంది. చివరకు స్థానిక సంస్థల్లో ఆయువు పట్టుగా నిలిచే ఎంపీటీసీ ఎన్నికలకు సైతం టీడీపీ దూరంగా జరిగిపోయింది. అసలు తాము ప్రతిపక్షమే కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రజా క్షేత్రంలో అధికార వైసీపీకి ధీటుగా ఎదురెళ్లుతోంది. […]