OnePlus N6x: ప్రీమియం ఫోన్ కావాలని ఎదురుచూసేవారికి OnePlus కంపెనీ నుంచి ఆకర్షణీయమైన మోడల్స్ అందుబాటులోకి వస్తుంటాయి. ఇందులో భాగంగా లేటేస్ట్ గా ఇప్పుడు మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ సరికొత్త ‘N’ సిరీస్ భారత్‌లోకి వచ్చింది. ‘వన్ ప్లస్ N6’ పేరుతో ఈ మొబైల్‌ను జూన్ 30న గ్రాండ్‌గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే వన్ ప్లస్ సంస్థ తన యూజర్లకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సిరీస్ నుండి తదుపరి మోడల్ అయిన ‘వన్ ప్లస్ N6x’ భారత్‌లో త్వరలోనే విడుదల కాబోతున్నట్లు అధికారికంగా టీజ్ చేసింది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?
కొత్తగా మార్కెట్లోకి వచ్చే ‘వన్ ప్లస్ N6x’ స్మార్ట్‌ఫోన్ సేల్స్ కు సంబంధించి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మైక్రోసైట్ (Microsite) లైవ్ లోకి వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. ఇందులో ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనంది. ఈ మొబైల్ లో 6.8 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేయడం వల్ స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉండే అవకాశం ఉంది.
ఈ కొత్త మొబైల్ లో 50 MP ప్రైమరీ కెమెరా ఉండనుంది. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ఎపెక్స్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. తక్కువ బడ్జెట్‌లో 5G కనెక్టివిటీ, సూపర్ బ్యాటరీ లైఫ్ మరియు వన్ ప్లస్ బ్రాండ్ వాల్యూ కోరుకునే యువతను ఆకట్టుకోవడానికే కంపెనీ ఈ సరికొత్త N6x ఫోన్‌ను చాలా వేగంగా ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది.
దీని ధర, కచ్చితమైన లాంచ్ తేదీ వివరాలు త్వరలోనే కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది. వన్ ప్లస్ N6 మొబైల్ రూ.22,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి రాగా, రాబోయే వన్ ప్లస్ N6x అంతకంటే తక్కువ ధరలో లేదా మరికొన్ని ఫీచర్ల మార్పులతో మరింత అందుబాటు ధరలో వచ్చే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి.
