NTR Dragon: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన డ్రాగన్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటివరకు తన కెరియర్ లో ఇండస్ట్రీ హిట్ అయితే నమోదు కాలేదు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకొని యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఈ సినిమా క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లేనటువంటి క్లైమాక్స్ ని మనం ఈ సినిమాలో చూడబోతున్నాం అంటూ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తను అన్నట్టుగానే ఈ సినిమా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా? ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలాంటి విన్యాసాలు చేయబోతున్నాడు.
ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగానే ఈ క్లైమాక్స్ ఉంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకులందరిలో ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలిగే కెపాసిటి అతనికి ఉందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో పౌరాణికానికి సంబంధించిన పాత్రను కూడా తను చేయగలనని మరోసారి ప్రూవ్ చేయడానికి ఈ సినిమాలో అతనికి ఒక మంచి అవకాశం దొరకబోతుందట.
తద్వారా తను ఆయా పాత్రల్లో ఒదిగి పోయి నటించి ప్రేక్షకులను మెప్పిస్తాననే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… మొత్తానికైతే ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో వరుసగా సక్సెస్ లను సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
