ప్రభాస్ తో బాలీవుడ్ హాట్ బ్యూటీ రొమాన్స్ !

బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘వాణీ కపూర్’ ప్రభాస్ తో రొమాన్స్ చేయబోతోందా ? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లో ప్రభాస్‌ కి చిన్న ప్లాప్ బ్యాక్ ఉంది. ఆ ప్లాష్ బ్యాక్ లో హీరో పాత్రకి భార్యగా నటించబోతుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణీ కపూర్‌. మరి ఈ సినిమాతోనైనా వాణి కపూర్ కెరీర్ సెట్ అవుతుందేమో చూడాలి. నిజానికి వాణీ కపూర్ కి కావాల్సినంత సపోర్ట్ ఉంది, […]

Written By: admin, Updated On : July 9, 2021 10:40 am
Follow us on

బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘వాణీ కపూర్’ ప్రభాస్ తో రొమాన్స్ చేయబోతోందా ? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లో ప్రభాస్‌ కి చిన్న ప్లాప్ బ్యాక్ ఉంది. ఆ ప్లాష్ బ్యాక్ లో హీరో పాత్రకి భార్యగా నటించబోతుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణీ కపూర్‌. మరి ఈ సినిమాతోనైనా వాణి కపూర్ కెరీర్ సెట్ అవుతుందేమో చూడాలి.

నిజానికి వాణీ కపూర్ కి కావాల్సినంత సపోర్ట్ ఉంది, పైగా మంచి అందగత్తె కూడా. అన్నిటికి మించి ఎక్స్ పోజింగ్ చేయడంలో ఐటమ్ బ్యూటీలు కూడా సరిపోరు. అంత గొప్పగా హాట్ హాట్ షోలతో రెచ్చిపోతూ ఉంటుంది. మరి ఇంత చేసినా ఈ భామకి మాత్రం స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ రాలేదు. ఇన్నాళ్లు చిన్నాచితకా చిత్రాలతో కెరీర్ ను నెట్టుకొచ్చింది. మరి ఇప్పుడైనా సలార్ తో తనకు బ్రేక్ వస్తోందని ఆశ పడుతుంది.

ఎందుకంటే సలార్ కథలో వాణి కపూర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని టాక్. ఇక వాణీ కపూర్ ఎప్పుడో ఆ మధ్య నాని నటించిన ‘ఆహా కళ్యాణం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా ఎలాంటి ఉపయోగం లేదు. ఆ తర్వాత తెలుగులో ఈ భారీ భామకు అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్‌ లో మాత్రం వాణి కపూర్ నటించిన ‘శుధ్ దేశీ రొమాన్స్’, ‘బే ఫిక్రే’, ‘వార్’ లాంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి.

ఇక పాన్ ఇండియా స్టార్ అయ్యాక ‘ప్రభాస్’ సినిమాల్లో అందరూ నేషనల్ స్టార్సే కనిపిస్తున్నారు. అందుకే ప్రభాస్ సినిమాల గురించి నేషనల్ మీడియా కూడా ఎప్పటికప్పుడు అనేక రూమర్స్ క్రియేట్ చేస్తూ క్యాష్ చేసుకునే పనిలో పడింది. ‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ సందడి చేయనుంది. ఏప్రిల్‌ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది.