Prabhas: అన్ని ఇండస్ట్రీస్ లో లాగానే మన టాలీవుడ్ లో కూడా నెపోటిజం దశాబ్దాల నుండి కొనసాగుతుంది. కానీ తెలుగు ప్రేక్షకుల గొప్పతనం ఏమిటంటే, ఎంత పెద్ద సూపర్ స్టార్ బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా, కేవలం టాలెంట్ ఉంటేనే మన ఆడియన్స్ ప్రోత్సహిస్తారు. టాలెంట్ లేకపోతే మొదటి సినిమాతోనే బయటకి పంపిస్తారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా అందరి కుటుంబాల నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళు సక్సెస్ అయినవాళ్లు ఉన్నారు, ఫెయిల్ అయ్యి సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. ఇకపోతే మన టాలీవుడ్ లోకి ఇప్పుడు ప్రభాస్(Rebel Star Prabhas) కజిన్ సిద్దు అరంగేట్రం చేయబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. పెద్ద సూపర్ స్టార్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు కేవలం హీరో అవ్వాలని రూల్ లేదు. డైరెక్టర్ అవ్వొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవ్వొచ్చు.
ఇప్పుడు సిద్దు కూడా హీరో గా ఎంట్రీ ఇవ్వడం లేదు, డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ సోదరుడు ప్రభోద్ UV క్రియేషన్స్ బ్యానర్ లో ప్రధాన భాగస్వామిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సంస్థ లోనే సిద్దు మొదటి చిత్రం ఉండబోతుంది అట. ఇక ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం శర్వానంద్ తో యూవీ క్రియేషన్స్ సంస్థ ‘బైకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమా తర్వాత వెంటనే సిద్దు దర్శకత్వం లో శర్వానంద్ హీరో గా చేయడానికి రెడీ గా ఉన్నాడట. త్వరలోనే ఒక శుభ ముహూర్తం లో ఈ సినిమా షూటింగ్ మొదలు అవుతుందని, అంతకు ముందు ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటిస్తారని, ఈ ఈవెంట్ కి ప్రభాస్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇకపోతే ప్రభాస్ నుండి ప్రస్తుతం ‘రాజా సాబ్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 9వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక పాట, ఒక థియేట్రికల్ ట్రైలర్ మరియు టీజర్ విడుదలయ్యాయి. ఇవేమి కూడా ఈ చిత్రం పై అంచనాలు పెంచడం లో సక్సెస్ కాలేదు . రేపు ఈ సినిమా నుండి ‘సహానా..సహానా’ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల కాబోతుంది. తమన్ సంగీతం అందించిన ఈ మెలోడీ ప్రోమో రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. చూస్తుంటే ఈ పాట పెద్ద హిట్ అయ్యేలాగానే కనిపిస్తోంది.