Ustaad Bhagat Singh movie release update: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం వారం రోజులు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే మార్చి 19 న ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇంత సడన్ గా విడుదల తేదీని మార్చేశారేంటి ?, మార్చి 26 కి విడుదల తేదీని ప్రకటించారు కాబట్టి, మూవీ టీం ప్లానింగ్ మొత్తం ఆ తేదికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు చెప్పిన తేదికంటే ముందు రాబోతుండడంతో ప్లానింగ్ మొత్తం మార్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మేకర్స్ కి ప్రతీ రోజు చాలా ముఖ్యం. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు కేవలం ఒక్క పాట విడుదల అయ్యినట్టు లెక్క. రీసెంట్ గా విడుదల చేసిన #Auraofustaad సాంగ్ సినిమాలో ఉండదు అనే టాక్ వినిపిస్తోంది.
ఇంకా ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదల అవ్వాలి, టీజర్ , ట్రైలర్ , ఇంటర్వ్యూస్ , ప్రీ రిలీజ్ ఫంక్షన్ , ఇలా చాలా ఉన్నాయి. విడుదల తేదీ చూస్తే పట్టుమని 2 వారాలు కూడా లేవు. అనుకున్న పనులు , అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అనే టెన్షన్ ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. ఇంత హడావిడిగా విడుదల తేదీని ప్రకటించడం ఎందుకు ?, కాస్త ముందుగానే ఈ విడుదల తేదీని ఫిక్స్ చేసి ఉండొచ్చు కదా అని అందరూ అంటున్నారు. కానీ ముందుగా ఈ తేదీని ప్రకటించకపోవడానికి కారణం రెండు పాన్ ఇండియన్ బిగ్ బడ్జెట్ సినిమాలు ఒకే రోజున రాబోతుండడం వల్లే. అయితే అందులో ఒక సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో మేకర్స్ క్షణం కూడా ఆలోచించకుండా మార్చి 19 కి సినిమా ని ప్రీ పోన్ చేశారు.
Also Read: నాగ చైతన్య ‘వృష కర్మ’ టీజర్ రివ్యూ : పట్టపగలే వణుకు పుట్టించే విజువల్స్..!
ఇలా చేయడానికి గల ముఖ్య కారణం, సెన్సేషనల్ డేట్ కాబట్టే. మార్చి 19 న ఉగాది పండుగ. ఆ తర్వాత ఒక్క రోజు గ్యాప్ తో మార్చి 21 న రంజాన్ పండగ. ఆ తర్వాత ఆదివారం వస్తుంది. ఈ నాలుగు రోజుల్లోనే ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెడుతుంది. రెండవ వారం లో కూడా ఈ సినిమాకు సెలవులు ఉన్నాయి. మార్చి 26 న శ్రీ రామ నవమి పండుగ కాగా, మార్చి మొదటి వారం లో గుడ్ ఫ్రైడే. ఇలా వరుసగా రెండు వారాల పాటు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రుద్రతాండవం ఆడొచ్చు. అందుకే మేకర్స్ ఇంత హడావిడిగా ఈ చిత్రాన్ని ముందుకు జరపాల్సి వచ్చింది.