Ustaad Bhagat Singh first day collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఈనెల19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉగాది సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతుంది అనేది తెలియాల్సి ఉంది. గత సంవత్సరం వచ్చిన ఓజీ సినిమా మొదటి రోజు 150 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమా కూడా ఆ రేంజ్ లోనే కలెక్షన్స్ ని రాబడుతుందని పలు రికార్డులను సైతం బ్రేక్ చేయగలుగుతుంది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు… ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతి ఒక్కరు ఆ సినిమా మీద ఆసక్తి చూపిస్తారు.
కాబట్టి ప్రీమియర్ షోస్ కి అలాగే బెనిఫిట్ షో చూడటానికి చాలా మంది ఆసక్తిని చూపించే అవకాశాలైతే ఉన్నాయి. హరీష్ శంకర్ లాంటి దర్శకుడికి పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాలో తనకు బాగా తెలుసు… కాబట్టి అలాంటి ఒక క్యారెక్టర్ లోనే పవన్ కళ్యాణ్ ని చూపించి సక్సెస్ ని సాధిస్తానని తను చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది.
ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుందా? ఈ సినిమాతో తో పవన్ కళ్యాణ్ తన అభిమానుల ఆకలి తీర్చబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది… హరీష్ శంకర్ లాంటి దర్శకుడు కమర్షియల్ సినిమాలను చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. తనకున్న నాలెడ్జ్ తో సినిమా మీద ప్రేక్షకుడికి తెలియని ఒక అటెన్షన్ ను క్రియేట్ చేస్తాడా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతి ఒక్కరు ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు…
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతున్న స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ తో పోటీ పడే రేంజ్ లో లేరు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా సైడ్ అయిపోవాల్సిందే… ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎంతటి రికార్డులను కొల్లగొడుతుంది. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…