Homeఅంతర్జాతీయంArab countries war burden: యుద్ధ భారం అరబ్‌ దేశాలపై.. ట్రంప్‌ వసూలు వ్యూహం!

Arab countries war burden: యుద్ధ భారం అరబ్‌ దేశాలపై.. ట్రంప్‌ వసూలు వ్యూహం!

Arab countries war burden: పశ్చిమాసియా యుద్దం మొదలై నెల రోజులు దాటింది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. తప్పక గెలుస్తామని అమెరికా అంటుంది. చివరి వరకు పోరాడతామని ఇరాన్‌ అంటోంది. దీంతో దాడులతో పశ్చిమాసియ రగులుతూనే ఉంది. అయితే ఈయుద్ధంలో ఇరాన్‌ అమెరికాను ఆర్థికంగా దెబ్బకొడుతోంది. భారీగా ఖర్చు చేయిస్తోంది. ఇప్పటికే రోజుకు 500 నుంచి 800 డాలర్లు ఖర్చు చేస్తోంది. యుద్ధం ముగిసిన తర్వాత ఆ మొత్తాన్ని అరబ్‌ దేశాల నుంచి […]

Arab countries war burden: పశ్చిమాసియా యుద్దం మొదలై నెల రోజులు దాటింది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. తప్పక గెలుస్తామని అమెరికా అంటుంది. చివరి వరకు పోరాడతామని ఇరాన్‌ అంటోంది. దీంతో దాడులతో పశ్చిమాసియ రగులుతూనే ఉంది. అయితే ఈయుద్ధంలో ఇరాన్‌ అమెరికాను ఆర్థికంగా దెబ్బకొడుతోంది. భారీగా ఖర్చు చేయిస్తోంది. ఇప్పటికే రోజుకు 500 నుంచి 800 డాలర్లు ఖర్చు చేస్తోంది. యుద్ధం ముగిసిన తర్వాత ఆ మొత్తాన్ని అరబ్‌ దేశాల నుంచి వసూలు చేయాలని భావిస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్‌ల నుంచి ఈ ఖర్చును రాబట్టనున్నట్లు వైట్‌ హౌస్‌ వర్గాలు సూచించాయి. ఇది ట్రంప్‌కు మాత్రమే కాదు – అమెరికా పాలసీలో భాగమే.

చరిత్రలో అమెరికా వసూలు..
అమెరికా యుద్ధాలు చేసి, ఖర్చును ఇతర దేశాల నుంచి తిరిగి పొందడం కొత్త విషయం కాదు. 1991 గల్ఫ్‌ యుద్ధం సమయంలో సద్దాం హుస్సేన్‌పై యుద్ధం తర్వాత అమెరికా, నాటో దేశాలు 400 కోట్ల డాలర్లు (రూ.33,000 కోట్లు) సౌదీ, కువైట్, జపాన్, జర్మనీల నుంచి వసూలు చేశాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సైన్య మోహరింపు ఖర్చులో 75% జపాన్‌ భరిస్తోంది. రష్యాపై యుద్ధంలో ఆయుధాలు అందించిన అమెరికా, ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఉక్రెయిన్‌లోని ఖనిజాల (లిథియం, టైటానియం) హక్కులకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇరాన్‌ యుద్ధం ఖర్చు ఇలా..
అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన లెక్కల ప్రకారం ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా రోజుకు 500 నుంచి 800 మిలియన్‌ డాలర్లు (రూ.4,500–7,200 కోట్లు) వసూలు చేస్తోంది. నెలవారీ ఖర్చు 15–24 బిలియన్‌ డాలర్లు(రూ.1.35–2.16 లక్షల కోట్లు). 2 నుంచి 3 నెలల్లో 50 బిలియన్‌ డాలర్లు (రూ.4.5 లక్షల కోట్లు) పైగా ఉంటుందని అంచనా. ఈమొత్తాన్ని ట్రంప్‌ అరబ్‌ దేశాల నుంచి వసూలు చేయాలని చూస్తున్నట్లు ట్రంప్‌ స్పోక్స్‌పర్సన్‌ తెలిపాడు.

అరబ్‌ దేశాల్లో ఎవరి వాటా ఎంత?
యుద్ధం ఖర్చులో సౌదీ అరేబియా 20 నుంచి 25 బిలియన్‌ డాలర్లు, యూఏఈ 10 నంచి 12 బిలియన్‌ డాలర్లు, ఖతార్‌ 8 నుంచి 10 బిలియన్‌ డాలరు, బహ్రెయిన్‌ నుంచి 5 నుంచి 7 బిలియన్‌ డాలర్లు వసూలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు ఇరాన్‌ నుంచే వసూలు చేయాలని సూచిస్తున్నారు. కానీ ఇప్పటికే యుద్ధనష్టాన్ని తమకు పరిహారంగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇరాన్‌ వ్యవస్థ కుప్పకూలింది. అక్కడి నుంచి వసూలు అసాధ్యం.

అమెరికా ’వసూలు’ పాలసీ
అమెరికా ప్రపంచవ్యాప్తంగా తన సైన్యాన్ని మోహరించి, ఖర్చును భర్తీ చేసుకుంటోంది. దక్షిణ కొరియా సైనిక ఖర్చులో 50% భరిస్తోంది. నాటో దేశాలు బడ్జెట్‌లో అధిక వాటా చెల్లిస్తున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో ఉచిత స్థావరాలు ఏర్పాటు చేసింది. సౌకార్యలు కల్పించింది.

అమెరికా యుద్ధం చేస్తుంది, బిల్లు ఇతరులు భరించాలంటోంది. ఇరాన్‌ యుద్ధం విషయంలో అరబ్‌ దేశాలు 50 బిలియన్‌ డాలర్లు (రూ.4.5 లక్షల కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఇది న్యాయమా అనేది వివాదాస్పదం. కానీ అమెరికా పాలసీ స్పష్టం. ప్రపంచ భద్రతకు యుద్ధం చేస్తాం, ఖర్చు మీరు భరించాలి అన్నది అగ్రరాజ్యం పాలసీ.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper