Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 worldwide collections: 'ధురంధర్ 2: ది రివెంజ్' 2 వారాల వరల్డ్ వైడ్...

Dhurandhar 2 worldwide collections: ‘ధురంధర్ 2: ది రివెంజ్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..జోరు బాగా తగ్గిపోయిందిగా..

Dhurandhar 2 worldwide collections: భారీ ఓపెనింగ్స్ తో ట్రేడ్ పండితులు సైతం నివ్వెరపోయే రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) జోరు , ఇప్పుడు రోజురోజుకూ బాగా తగ్గిపోతూ వస్తోంది. ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ గ్రాస్ ని చూసి , కచ్చితంగా 2000 కోట్ల గ్రాస్ మార్కుని దాటి , ఇండియా లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ జరిగే […]

Dhurandhar 2 worldwide collections: భారీ ఓపెనింగ్స్ తో ట్రేడ్ పండితులు సైతం నివ్వెరపోయే రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) జోరు , ఇప్పుడు రోజురోజుకూ బాగా తగ్గిపోతూ వస్తోంది. ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ గ్రాస్ ని చూసి , కచ్చితంగా 2000 కోట్ల గ్రాస్ మార్కుని దాటి , ఇండియా లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ జరిగే పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. ‘బాహుబలి 2’ చిత్రానికి 1860 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా ఆ గ్రాస్ ని దాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ, దంగల్ సాధించిన 2000 కోట్ల గ్రాస్ ని దాటడం మాత్రం ప్రస్తుతానికి కష్టమే అని అంటున్నారు. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రం 2 వారాల్లో 1500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

14 వ రోజున ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి అన్నీ భాషలకు కలిపి 21 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, 24 కోట్ల 74 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బాషల వారీగా ఈ చిత్రానికి 14 వ రోజు వచ్చిన గ్రాస్ ని పరిశీలిసే హిందీ నుండి 18 కోట్ల 82 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు నుండి 1 కోటి 44 లక్షలు, తమిళం నుండి 44 లక్షలు, కన్నడ నుండి 18 లక్షలు, మలయాళం నుండి 9 లక్షల రూపాయిలను రాబట్టింది. ఇది కేవలం ఇండియా నుండి వచ్చిన వసూళ్లు మాత్రమే. ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి 14 వ రోజున 5 కోట్ల 61 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 14 వ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 30 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Also Read: బాలయ్య డ్రీమ్ రోల్ అదే…దాన్ని నెరవేర్చుకోవడానికి ఈ పనిచేస్తున్నాడు…

ఓవరాల్ గా ఈ చిత్రానికి 14 వ రోజుతో కలిపి 1500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. శుక్రవారం నుండి మరోసారి ఈ సినిమా వసూళ్లు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే , దానిని అనుసరిస్తూ వీకెండ్ ఉండడం చాలా పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ఈ వీకెండ్ ముగిసేసరికి కచ్చితంగా ఈ చిత్రం 1800 కోట్ల రూపాయిల గ్రాస్ ని దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా ?, ఒకవేళ వెళ్లినా ఫుల్ రన్ లో బాహుబలి 2 ని దాటుతుండగా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper