Actress Surgery Failed: దేవుడు ఇచ్చిన రూపాన్ని వదిలేసి కొంతమంది సర్జరీలు చేయించుకొని ముఖాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఈమధ్య కాలంలో అలాంటి హీరోయిన్స్ ఎక్కువ అయిపోయారు. పైన మీరు చూసిన ఫోటో లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?, ఈమె బాలీవుడ్ లో ప్రసారమయ్యే ఎన్నో టీవీ షోస్ లో హీరోయిన్ గా నటించింది. సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ తో ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ ఆ అవకాశాలు ఆమెని పెద్ద రేంజ్ కి తీసుకొని వెళ్లలేకపోయాయి కానీ జనాలు మాత్రం చూస్తే గుర్తు పట్టే రేంజ్ సెలబ్రిటీనే. సోషల్ మీడియా లో కూడా ఈమె చాలా చురుగ్గా ఉంటుంది. తెలుగు లో ఈమె ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలు కానీ, సీరియల్స్ కానీ చేయలేదు. ఈమె పేరు ఏంటంటే ఉర్ఫీ జావేద్(Urfi Javid). సినీ రంగం లోకి వచ్చే ముందు ఈమె మోడల్ గా బాగా పాపులర్ అయ్యింది.
Also Read: తమిళ రాజకీయాలను షేక్ చేసే నిర్ణయం తీసుకున్న ధనుష్…
ఆ తర్వాత ఈమె ‘బడే భయ్యా కి దుల్హానియా’ అనే టీవీ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ పెద్ద హిట్ అవ్వడం తో ఆమెకు వరుసగా సీరియల్ ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. 2017 లో ఈమె చేసిన ‘చంద్ర నందిని’ అనే సీరియల్ ఇంకా పెద్ద హిట్ అయ్యింది. ఈ సీరియల్ ని తెలుగు లోకి కూడా దబ్ చేశారు. ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లో అనేక సీరియల్స్ లో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటించి బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. 2021 వ సంవత్సరం లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో ఒక కంటెస్టెంట్ గా చేసింది. ఈ సీజన్ తో ఆమె ఆడియన్స్ కి మరింత దగ్గర అయ్యింది. అంతే కాదు కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించిన ‘ది ట్రైటర్స్ ఇండియా’ విన్నర్ గా కూడా నిల్చింది.
Also Read: సూర్య బర్త్ డే.. జ్యోతిక చేసిన పని వైరల్
ఇదంతా పక్కన పెడితే ఈమధ్యనే ఈమె తన పేదలకు సర్జరీ చేయించుకుంది. అది వికటించడం తో అందవికారంగా మారిపోయింది. ఇప్పుడు ఈమెను ఆడియన్స్ అసలు గుర్తు పట్టలేకపోతున్నారు. ఎలా ఉండే అమ్మాయి ఎలా అయిపోయింది అంటూ బాధపడుతున్నారు. దేవుడు ఇచ్చిన అందమైన ముఖాన్ని నాశనం చేసుకున్నావ్ కదా, నీకు అలా అవ్వాల్సిందేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈమె మళ్ళీ తన ఒరిజినల్ లుక్ లోకి వస్తుందా?, లేదా ఇలాగే ఉండిపోతుందా అనేది చూడాలి. ఈమెని అభిమానించే వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు.