England vs India 4th Test: మామూలుగా అయితే ఒక ఆటగాడు ఎనిమిదేళ్లు జాతీయ జట్టుకి దూరంగా ఉంటే.. దాదాపు క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలుకుతాడు. లేదా ఇంకో అవతారం ఎత్తుతాడు. కానీ ఇతడు పట్టు వదలని విక్రమార్కుడు. 8 సంవత్సరాలుగా జాతీయ జట్టులోకి పిలుపు లేకపోయినప్పటికీ నిరీక్షించాడు. తపనపడ్డాడు. మైదానంలో తీవ్రంగా శ్రమించాడు. చివరికి మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది. అయితే తనను తుది జట్టులోకి తీసుకుంటేనే ఎంపిక చేయండి షరతు విధించాడు. దీంతో మేనేజ్మెంట్ అలానే చేసింది. రోగి కోరింది పెరుగన్నం.. డాక్టర్ తినమని చెప్పింది పెరుగన్నమే అన్నట్టుగా.. అతడి ఆలోచనకు తగ్గట్టుగానే మేనేజ్మెంట్ కూడా నిర్ణయం తీసుకుంది.. సీన్ కట్ చేస్తే అతడికి ఇంగ్లాండ్ తుది జట్టులో అవకాశం లభించింది. అంతేకాదు మాంచెస్టర్ లో మ్యాజిక్ ప్రదర్శించే అవకాశమూ దక్కింది.
Also Read: బద్దలవ్వడానికి 5 రికార్డులు సిద్ధం.. మాంచెస్టర్ లో టీమిండియా అద్భుతం చేస్తుందా?
నాలుగో టెస్ట్ లో టీమ్ ఇండియా ఓపెనర్ రాహుల్ దూకుడుగా ఆడుతున్న క్రమంలో అవుట్ అయినప్పటికీ.. మరో ఎండ్ లో జైస్వాల్ హాఫ్ సెంచరీ తో కదం తొక్కాడు. స్థిరంగా ఆడుతున్న అతడిని బషీర్ స్థానంలో వచ్చిన డాసన్ వెనక్కి పంపించాడు..58 పరుగులు చేసిన అతడిని డాసన్ అద్భుతమైన బంతివేసి బోల్తా కొట్టించాడు..బ్రూక్ పట్టిన క్యాచ్ తో అతడు వెను తిరిగాడు. దీంతో భారత్ ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడింది.. ఎప్పుడైతే జైస్వాల్ వికెట్ ఇండియా కోల్పోయిందో.. స్కోర్ కూడా మందగించింది. ఆ తర్వాత కొద్ది పరుగులకే కెప్టెన్ గిల్ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో పంత్ కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసినప్పటికీ.. గాయం వల్ల అతడు కూడా రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.. సౌకర్యవంతంగా ఆడుతున్న సాయి సుదర్శన్ 61 పరుగులు చేసి.. స్టోక్స్ బౌలింగ్లో అనవసరమైన షాట్ కు యత్నించి అవుట్ అయ్యాడు.
Also Read: గిల్ సేన 2021 చరిత్రను పునరావృతం చేస్తుందా?
డాసన్ 8 సంవత్సరాల తర్వాత జట్టులోకి వచ్చి తన సత్తా చాటాడు. 2017లో డా సన్ తన చివరి టెస్ట్ ఆడాడు.. అయితే కౌంటింగ్ క్రికెట్లో డాన్ అదరగొడుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 371 వికెట్లు పడగొట్టాడు. 18 సెంచరీలు కూడా చేశాడు..జాక్ లీచ్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ ఇటువంటి వాళ్ళను కాదని డాసన్ కు ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చిందంటే అతడి ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జైస్వాల్ వికెట్ పడగొట్టడం ద్వారా డాసన్ భారత స్కోర్ కు కళ్లెం వేశాడు.. ఒకవేళ జైస్వాల్ అలానే ఉండి ఉంటే భారత జట్టు స్కోరు 300 దాటేది.