https://oktelugu.com/

‘ఉప్పెన’ మరోసారి రిపీట్?

కరోనా లాక్ డౌన్ అనంతరం అందరూ విడుదల చేయడానికి భయపడినా కూడా ధైర్యం చేసి రిలీజ్ చేశాడు బుచ్చిబాబు. ఈ సుకుమార్ శిష్యుడు గ్రాండ్ హిట్ అందుకొని టాలీవుడ్ చరిత్రను కొత్త కథాంశంతో తిరగరాశాడు. 2021 లో సూపర్ హిట్స్ అందించిన దర్శకుడిగా మారాడు. కొత్త హీరో, కొత్త హీరోయిన్ లతో ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లు అందుకోగలిగింది. దర్శకుడు బుచ్చిబాబు ఎంచుకున్న కథ విమర్శకుల ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా విడుదల అవ్వకముందే దర్శకుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 3, 2021 / 08:16 PM IST
    Follow us on

    కరోనా లాక్ డౌన్ అనంతరం అందరూ విడుదల చేయడానికి భయపడినా కూడా ధైర్యం చేసి రిలీజ్ చేశాడు బుచ్చిబాబు. ఈ సుకుమార్ శిష్యుడు గ్రాండ్ హిట్ అందుకొని టాలీవుడ్ చరిత్రను కొత్త కథాంశంతో తిరగరాశాడు. 2021 లో సూపర్ హిట్స్ అందించిన దర్శకుడిగా మారాడు.

    కొత్త హీరో, కొత్త హీరోయిన్ లతో ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లు అందుకోగలిగింది. దర్శకుడు బుచ్చిబాబు ఎంచుకున్న కథ విమర్శకుల ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా విడుదల అవ్వకముందే దర్శకుడు బుచ్చిబాబు, హీరోయిన్ కృతిశెట్టిలతో మరో సినిమాకు అగ్రిమెంట్లు చేయించుకుంది మైత్రీ మూవీస్.

    ఇప్పుడు బుచ్చిబాబు రెండో సినిమా కూడా మైత్రీ మూవీస్ లోనే చేయనున్నారు. ఓ స్టార్ హీరోతో ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ బుచ్చిబాబుకు పరిస్థితులు అనుకూలించడం లేదు.

    ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేయడానికి బుచ్చిబాబు రెడీగానే ఉన్నా వాళ్లు మాత్రం ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో బుచ్చిబాబు సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు.

    ఈ ఖాళీ గ్యాప్ లో ‘ఉప్పెన’ లాంటి ఎమోషనల్ చిన్న సినిమాను తీయడానికి బుచ్చిబాబు రెడీ అయిపోయినట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమా మైత్రీలోనే ఉండబోతోంది. ఇందులోనూ వైష్ణవ్ తేజ్ నటించే అవకాశాలు ఉన్నాయి. ఉప్పెన టీం రిపీట్ కాబోతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.