Site icon OkTelugu

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. ఎన్నంటే?

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,08,954 కరోనా పరీక్షలు నిర్వహించగా 848 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,26,085కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఆరుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,684కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,114 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,09,947కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,454 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Exit mobile version