Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఈ ఏడాది ఓజీ(they Call him og) మూవీ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. ‘హరి హర వీరమల్లు’ లాంటి ఘోరమైన డిజాస్టర్ విడుదలైన రెండు నెలలకే ఈ రేంజ్ కంటెంట్ ఉన్న సినిమాని పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కి అందించడం నిజంగా ఊహించని సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie). ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ కి సంబంధించి మొత్తం పూర్తి అయ్యింది. కేవలం ఇతర నటీనటలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ప్రస్తుతం మారేడుమల్లి లో షూటింగ్ జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ నుండి పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా వచ్చి దాదాపుగా 12 ఏళ్ళు కావొస్తుంది .
మధ్యలో సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి వంటి చిత్రాలు వచ్చినప్పటికీ అవి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఒక సరైన మాస్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా పడితే పవన్ కళ్యాణ్ మరో సారి ఇండస్ట్రీ హిట్ కొడుతాడు అనేది అభిమానుల ఆశ. అందుకు తగ్గట్టుగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉండడం తో ఈ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు విడుదలైన రెండు టీజర్ వీడియోస్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ బస్టర్ కల ఉట్టిపడింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ రాబోతుంది. ఈ నెల 13న ఆ పాటని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అట. నేడు సాయంత్రం ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ వేసిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘మీ అందరికన్నా నేనే ఎక్కువ ఎదురు చూస్తునాను. సాయంకాలం, దేఖ్లేంగే సాలా, స్టెప్పేస్తే భూకంపమే’ అంటూ ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ‘దేఖ్లేంగే సాలా’, ‘స్టెప్పేస్తే భూకంపం’ వంటివి ఈ పాట లిరిక్స్ లో ఉంటాయి అని. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఇందులో మైఖేల్ జాక్సన్ స్టెప్పులు వేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేయడమే చాలా అరుదు, అలాంటిది ఏకంగా ఆయన మైఖేల్ జాక్సన్ స్టెప్పులు వెయ్యడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. సరిగ్గా స్టెప్పులేస్తే, సోషల్ మీడియా మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఆ పాట అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందా లేదా అనేది.