Iphone 16 Pro: మిగతా దేశాల్లో కంటే భారత్ లో iPhoneకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే కొంత మంది ధరను చూసి వెనుకడుగు వేస్తారు. ఈ నేపథ్యంలో Apple కంపెనీ మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా ఐఫోన్ కొనాలనే ఉద్దేశంలో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటుంది. కొన్ని మొబైల్స్ ఇప్పటికే రిలీజ్ అయి చాలా రోజులు అయినప్పటికీ వాటి అమ్మకాలను పెంచుకునేందుకు ఈ ఆఫర్లను తీసుకువస్తుంది. లేటేస్టుగా యాపిల్ కంపెనీకి చెందిన iPhone 16 పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించారు. ఈ మొబైల్ ను ఇప్పుడు రూ.40,00కు కొనుగోలు చేయొచ్చు. ఇంత తక్కువ ధరకు అందిస్తున్న ఈ మొబైల్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? వీటితో పాటు ఇంకేమైనా డిస్కౌంట్లు వర్తిస్తాయా?
iPhone 16 ఇప్పటికే అత్యంత ఎక్కువ మంది కొనుగోలు చేశారు. అయితే దీనిపై Flipkart Buy Buy 2025 డిస్కౌంట్ ను ప్రకటించింది. వాస్తవానికి ఈ మొబైల్ మార్కెట్లో రూ.68,050 తో విక్రయిస్తున్నారు. కానీ ఇప్పుడు దీనిని రూ.40,000లకే అందించనున్నారు. కానీ ఇదే ధరకు కాకుండా మరింత తక్కువకు కూడా కొనుగోలు చేయొచ్చు. FlipKart క్రెడిట్ కార్డు ఉన్న వారు.. ఈ కార్డుపై మొబైల్ కొనుగోలు చేస్తే రూ.4,929 తగ్గింపును పొందుతారు. అంటే దాదాపు రూ.35,000లకే కొనుగోలు చేయొచ్చు. అలాగే పాత మొబైల్ ఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. కానీ ఆ మొబైల్ పనితీరును బట్టి ధరను నిర్ణయిస్తారు.
ఇంత తక్కువ ధరకు ఇచ్చే ఈ మొబైల్ లో ఫీచర్లు మాత్రం తగ్గేదేలే.. అన్నట్లుగా ఉన్నాయి. ఇందులో A19 చిప్ సెట్ ను జత చేశారు. 8 జీబీ ర్యామ్ తో పాటు AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. అప్డేట్ సాప్ట్ వేర్ ఉండడంతో ఎక్కువకాలం సురక్షితంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో 48 మెగా పిక్సెల్ ప్రధానమైన సెన్సార్ కెమెరాలో రిఫ్రెష్ చేయబడిన అల్ట్రావైడ్ లెన్స్ బటన్ ఉండనుంది. ఇది పాత మొబైల్ అయినప్పటికీ కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాటికి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ ఫొన్ రిలీజ్ అయినప్పుడు కొనుగోలు చేయలేని వారు ఇప్పుడు డిస్కౌంట్ రావడంతో కొనడానికి ఎగబడుతున్నారు.
అయితే ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో ట్రెండ్ నడుస్తున్న క్రమంలో ఎంత మంది దీనిని కొనుగోలు చస్తారనేది చూడాలి. అంతేకాకుండా ప్రస్తుతం ఏఐ ఫీచర్లతో కూడిన మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇలాంటి సమయంలో ఈ ఫోన్ కు డిమాండ్ తగ్గడం లేదని కొందరు నిపుణులు అంటున్నారు.