https://oktelugu.com/

Upcoming OTT release: సినిమా ప్రియులకు పండగే… ఈ వారం ఓటీటీలో, థియేటర్స్ లో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!

Upcoming OTT release: రాశి ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు చేయగా దర్శకుడు సుందర్ సీ నటించి తెరకెక్కించిన థ్రిల్లర్ బాక్. వెన్నెల కిషోర్, కోవై సరళ కీలక రోల్స్ చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 17, 2024 / 01:51 PM IST

    Upcoming OTT release

    Follow us on

    Upcoming OTT release: ఈ వారం సినిమా లవర్స్ కి పండగే. అద్భుతమైన చిత్రాలు అటు ఓటీటీలో ఇటు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. అవేమిటో చూద్దాం… వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం నింద. తనికెళ్ళ భరణి, అని, భద్రం కీలక రోల్స్ చేశారు. నింద చిత్రానికి రాజేష్ జగన్నాథం దర్శకుడు. నింద చిత్రం జూన్ 21న థియేటర్స్ లో విడుదల కానుంది.

    స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ అప్పుడప్పుడూ హీరోగా కూడా అలరిస్తున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ OMG(ఓ మంచి ఘోస్ట్). నందిత శ్వేతా హీరోయిన్ గా నటించింది. శంకర్ మార్తాండ్ తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ జూన్ 21న థియేటర్స్ లోకి రానుంది.

    చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. తనికెళ్ళ భరణి, సుహాసిని కీలక రోల్స్ చేశారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకుడు కాగా… జూన్ 21న విడుదల చేస్తున్నారు.

    నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్లలో కోటా ఫ్యాక్టరీ ఒకటి. గత రెండు సీజన్స్ కి మంచి ఆదరణ లభించింది. తాజాగా సీజన్ 3 సిద్ధం చేశారు. ఐఐటీ లో అడ్మిషన్స్ కోసం నానా పాట్లు పడే విద్యార్థులు ఇబ్బందుల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. జూన్ 20 నుండి నెట్ఫ్లిక్స్ లో కోటా ఫ్యాక్టరీ 3 స్ట్రీమ్ కానుంది.

    రాశి ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు చేయగా దర్శకుడు సుందర్ సీ నటించి తెరకెక్కించిన థ్రిల్లర్ బాక్. వెన్నెల కిషోర్, కోవై సరళ కీలక రోల్స్ చేశారు. మే 3న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో జూన్ 21న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేస్తున్నారు.

    Also Read: OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో 11 సినిమాలు… ఆ ఐదు మాత్రం మిస్ కావద్దు!

    ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమ్ కానున్న చిత్రాలు, సిరీస్లు ఏమిటో చూద్దాం..

    నెట్ఫ్లిక్స్
    ఏజెంట్ ఆఫ్ మిస్టరీ -కొరియన్ సిరీస్- జూన్ 18
    అవుట్ స్టాండింగ్ – హాలీవుడ్ మూవీ -జూన్ 18
    మహారాజ్-హిందీ సిరీస్- జూన్ 18
    అమెరికాస్ స్వీట్ హార్ట్స్ – వెబ్ సిరీస్- జూన్ 20
    నడిగర్-మలయాళం మూవీ – జూన్ 21
    ట్రిగర్ వార్నింగ్-హాలీవుడ్ మూవీ -జూన్ 21

    డిస్నీ ప్లస్ హాట్ స్టార్
    బ్యాడ్ కాప్ -హిందీ మూవీ- జూన్ 21
    బాక్ – తమిళ్ మూవీ- జూన్ 21

    Also Read: OTT: ఇండియాలో ఓటీటీ భవిత్యం ఏమిటి..? తేలేది నేడే! కొనసాగుతున్న ఉత్కంఠ!

    జియో సినిమా

    ది హోల్డోవర్స్ – ఇంగ్లీష్ మూవీ – జూన్ 16
    హౌస్ ఆఫ్ ది డ్రాగన్ – వెబ్ సిరీస్ సీజన్ 2- జూన్ 17
    ఇండస్ట్రీ – వెబ్ సిరీస్ – జూన్ 19
    బిగ్ బాస్ ఓటీటీ – సీజన్ 3- జూన్ 21