https://oktelugu.com/

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో 11 సినిమాలు… ఆ ఐదు మాత్రం మిస్ కావద్దు!

OTT Releases: కంటెంట్ నచ్చితే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చేస్తున్నారు. ఇక ప్రతివారం లాగే అద్భుతమైన కంటెంట్ తో ఎంటర్టైన్ చేసేందుకు...

Written By:
  • S Reddy
  • , Updated On : June 15, 2024 / 05:19 PM IST

    OTT releases this week New movies, web-series to watch this weekend

    Follow us on

    OTT Releases: ఈ వారం ఓటీటీలో అలరించేందుకు కొన్ని క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్ సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 22 సినిమాల వరకు ఈ వారంలో విడుదల అయ్యాయి. అందులో శుక్రవారం ఏకంగా 11 సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం విశేషం. ఇటీవల కాలంలో ఓటీటీలకు బాగా ఆదరణ దక్కుతుంది. కంటెంట్ నచ్చితే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చేస్తున్నారు. ఇక ప్రతివారం లాగే అద్భుతమైన కంటెంట్ తో ఎంటర్టైన్ చేసేందుకు… సినిమాలు, వెబ్ సిరీస్ సిద్ధంగా ఉన్నాయి.

    ఆ సినిమాలు, వెబ్ సిరీస్ల వివరాలు ఏమిటీ? ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో? ఇప్పుడు తెలుసుకుందాం.

    నెట్ ఫ్లిక్స్ ..

    బంగ్ అధిక – మాండరిన్ మూవీ – జూన్ 14
    గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – తెలుగు సినిమా – జూన్ 14
    జోకో అన్వర్స్ నైట్ అండ్ డే డ్రీమ్స్ – ఇండోనేషియన్ వెబ్ సిరీస్ – జూన్ 14
    మహారాజ్ హిందీ చిత్రం – జూన్ 14

    ఆహా
    డియర్ నాన్న – తెలుగు సినిమా – జూన్ 14
    కురంగు పెడల్ – తమిళ వెబ్ సిరీస్ – జూన్ 14

    జీ 5
    లవ్ కి అరేంజ్ మ్యారేజ్ – హిందీ చిత్రం – జూన్ 14
    పరువు – తెలుగు వెబ్ సిరీస్ – జూన్ 14

    డిస్నీ ప్లస్ హాట్ స్టార్
    యక్షిణి – తెలుగు వెబ్ సిరీస్ – జూన్ 14

    ఆపిల్ ప్లస్
    క్యాంప్ స్నూపీ – జూన్ 14

    బుక్ మై షో
    ఫాల్ గాయ్ – హాలీవుడ్ మూవీ – జూన్ 14

    ఇలా జూన్ 14న కొన్ని మూవీస్, వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో హారర్ ఫాంటసీ జోనర్లో యక్షిణి తెరకెక్కింది. ఇక మర్డర్ మిస్టరీ గా తెరకెక్కిన పరువు వెబ్ సిరీస్ చాలా ప్రత్యేకం. ఈ సిరీస్లో నివేద పేతురాజ్ కీలక రోల్ చేసింది. చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించడం విశేషం. అలాగే విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయిన తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేసింది. వాటితో పాటు తండ్రి, కొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కిన డియర్ నాన్న, పారిజాత పర్వం, ది బాయ్స్ వంటి చిత్రాలు మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. వీటిని ఓటీటీ లవర్స్ అసలు మిస్ కావద్దు.