Drushyam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో విక్టరీ వెంకటేష్…ఈయన ఫ్యామిలీ సినిమాలు చేస్తూ శోభన్ బాబు తర్వాత అంతటి ఫ్యామిలీ హీరో గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన మీనా కలిసి నటించిన దృశ్యం సినిమా తెలుగులో పెను ప్రభంజనాన్ని సృష్టించింది. మొదట ఈ సినిమాని మలయాళం లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అక్కడ సూపర్ సక్సెస్ అవ్వడంతో తెలుగులో రీమేక్ చేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా తెలుగులో ఒక వండర్ ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. అప్పటివరకు ఫ్లాప్ లో ఉన్న వెంకటేష్ కు సూపర్ సక్సెస్ ని అందించడమే కాకుండా సక్సెస్ ట్రాక్ ని ఎక్కించింది. ఇక మొత్తానికైతే వెంకటేష్ తనదైన రీతిలో ఈ సినిమాలో నటనను కనబరిచి సూపర్ సక్సెస్ ని అందుకోవడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ కూతుర్లుగా ఇద్దరమ్మాయిలు నటించారు. అందులో పెద్ద కూతురుగా కృతిక నటించగా, చిన్న కూతురుగా ఎస్తేర్ అనిల్ నటించింది. అయితే ఈ అమ్మాయి మలయాళం లో మోహన్ లాల్ చేసిన దృశ్యం సినిమాలో కూడా నటించడం విశేషం…ఇక ప్రస్తుతం ఎస్తర్ అనిల్ ఫోటో షూట్ తో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా దృశ్యం సినిమాలో చిన్న కూతురుగా నటించిన ఎస్తర్ అనిల్ ఎలా ఉందో తెలుసా? అంటూ సోషల్ మీడియాలో ఈ అమ్మాయి గురించి రచ్చ రచ్చ చేస్తున్నారు.
చిన్నతనం లోనే మంచి నటిగా గుర్తింపును సంపాదించుకున్న ఈ అమ్మాయి ఇకమీదట కూడా యాక్టింగ్ లో రాణిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకుందట. మరి మొత్తానికైతే తను సినిమా ఫీల్డ్ లోనే ఉండాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది.
కాబట్టి ఇక మీదట ఈమె హీరోయిన్ గా చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఈ అమ్మాయి ఫోటో చూసిన మరికొందరైతే అప్పుడేప్పుడో చిన్నతనంలో నటించి మెప్పించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఇంతలా ఎదిగిపోయిందా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపైతే వచ్చింది. ముఖ్యంగా దృశ్యం సినిమాతో వెంకటేష్ కి ఒక మంచి సక్సెస్ దక్కడమే కాకుండా టీమ్ మొత్తానికి మంచి పేరు కూడా వచ్చింది…