Mahesh Babu and Upasana Konidela : మహేష్ బాబు అభిమానులకు రామ్ చరణ్ భార్య శుభాకాంక్షలు తెలియచేయడం ఏమిటి?, మహేష్ బాబు కుటుంబానికి రామ్ చరణ్ కుటుంబం అత్యంత సన్నిహితులే. అనేక సందర్భాల్లో వీళ్ళు కలుసుకుంటూ ఉంటారు కూడా. అయినప్పటికీ ఒకరి శుభవార్తను మరొకరు ప్రకటించేంత చనువు వీళ్ళ మధ్య ఉందా? అని మీరు అనుకోవచ్చు. అంతటి చనువు ఉన్నప్పటికీ కూడా బయటపడరు. అయితే ఉపాసన మాత్రం బయటపడింది. నేడు ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక కామెంట్ మహేష్ బాబు అభిమానులను సంబరాలు చేసుకునేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకచోప్రా హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కోసం విచ్చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడో హాలీవుడ్ లో సినిమాలు చేసుకునే ప్రియాంక చోప్రాకి, అకస్మాత్తుగా మన హైదరాబాద్ లో షూటింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది?, కచ్చితంగా ఆమె మహేష్, రాజమౌళి సినిమాకి సంబంధించిన షూటింగ్ కోసమే వచ్చిందని అభిమానులు పసిగట్టేసారు.
ఈ చిత్రం లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం అనధికారికంగా బయటపడింది. మేకర్స్ ఈ విషయాన్ని బయటకి రానివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ, సోషల్ మీడియా కారణంగా ఏది దాగట్లేదు. అయితే మొన్న ప్రియాంక చోప్రా హైదరాబాద్ లోని చిలకలూరి బాలాజీ దేవాలయాన్ని సందర్శించింది. దీనికి సంబంధించిన ఫోటోని ఆమె తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా, ఆ పోస్ట్ క్రింద ఉపాసన కొణిదెల కామెంట్ చేస్తూ ‘నువ్వు చేస్తున్న కొత్త సినిమా నీ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి, చిలకలూరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడూ నీ వెంట ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ‘కొత్త సినిమా’ అనగానే మహేష్ బాబు అభిమానులు పసిగట్టి, ఉపాసన మన హీరో సినిమాని ఉద్దేశించే కామెంట్ చేసింది, అంటే నిజంగానే గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో మహేష్, రాజమౌళి మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు.
రామోజీ ఫిలిం సిటీ లో గత మూడు రోజులుగా రాజమౌళి కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడట. ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. మహేష్ బాబు త్వరలోనే సెట్స్ లోకి జాయిన్ అవ్వబోతున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటి వరకు మన ఇండియా లో ఇలాంటి జానర్ మీద సినిమా రాలేదు. సుమారుగా ఈ చిత్రం కోసం 1000 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు. మహేష్ ప్రత్యేకంగా ఈ సినిమా కోసం కోయ భాషతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. త్వరలోనే ఆయన సౌత్ ఆఫ్రికా లో పర్యటించబోతున్నారు. అక్కడే ఆయన 20 రోజులు గడిపి, ఆ ప్రాంతంలో ఉండే తెగలకు సంబంధించిన జనాల అలవాట్లను, సంప్రదాయాలని దగ్గరుండి పరిశీలించబోతున్నాడట. ఈ సినిమా కోసం ఆయన ఎంత డెడికేషన్ పెట్టబోతున్నాడు అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.