Upasana: అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ వాచ్ ఖరీదుపై ఓ సీన్ ఉంటుంది. అంటే ఆ వాచ్ అమ్ముకుంటే లైఫ్ సెట్ అయినట్లన్నమాట. ఆ రేంజ్లో ధర ఉంటుంది. అయితే, రియల్ లైఫ్‌లోనూ సెలబ్రిటీలు తన బట్టలు, వాచ్‌లు, షూలను చాలా ఖర్చు పెట్టి కొంటుంటారు. ఈ క్రమంలో ఏ సెలబ్రిటీ ఏ బ్రాండ్ ఉపయోగిస్తున్నారు?. వాటి ఖర్చెంత?.. అనే విషయాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే, రామ్‌చరణ్, ఎన్టీఆర్, నాగార్జున వంటి హీరోలు ధరించే బ్రాండ్ షర్ట్, వాచ్‌లపై అనేక వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా, రామ్‌చరణ్ ఉపాసన కూడా ఈ కేటగిరిలోకి చేరింది.
సాధారణంగా ఎప్పుడూ సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడుతుంటారు ఉపాసన.. అయితే, క్రిస్మస్ రోజు మాత్రం స్పెషల్ డ్రెస్‌తో అలరించింది. ఇప్పుడు ఈ డ్రెస్ ధర తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. 2021 క్రిస్మస్ కోసం ఉపాసన డోల్స్ అండ్ గబ్బానా నుండి సెల్ఫ్-టై బోతో చారల సిల్క్ మిడి దుస్తులను ఎంచుకుంది.
Also Read: Konidala Upasana: ప్రధాని మోదీతో మెగా పవర్ స్టార్ వైఫ్ ఉపాసన… కారణం ఏంటంటే
దాని ధర దాదాపు రూ. 2.5 లక్షలుగా తెలుస్తోంది. రామ్‌చరణ్‌తో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉపాసన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసింది. ఇందులో ఫుల్ స్లీవ్ రెడ్ అండ్ వైట్ డ్రెస్‌లో వైట్ హీల్స్‌తో అందంగా కనిపిస్తోంది. ఈ వేడుకలో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహతో సహా.. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక కొణిదెల ఇలా మెగా కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు.
Also Read: Naga Shaurya Lakshya: ప్చ్.. ‘ఆర్ఆర్ఆర్’కు ప్లాప్ సినిమా పోటీనా ?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Upasana dolce gabbana dress priced at rs 2 5 lakh for christmas
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com