shyam singha roy box office collection: నాని గత మూడు చిత్రాలు గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీశ్ అనుకున్నంత విజయం సాధించలేదు. మొత్తానికి నాని క్లీన్ హిట్ అందుకొని చాలా కాలం అవుతుంది. దీంతో హిట్ కొట్టడం నాని అనివార్యమైంది. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రయోగాత్మక సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
అయితే, సినిమాలో మ్యాటర్ లేదు అని ఇప్పటికే విమర్శలు వచ్చాయి. మరి ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం.
Also Read: Upasana: క్రిస్మస్కు ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే షాక్!
మరి శ్యామ్ సింగరాయ్ లేటెస్ట్ కలెక్షన్ల వివరాలను ఏరియాల వారిగా చూస్తే..
నైజాం 2.18 కోట్లు
సీడెడ్ 0.65 కోట్లు
ఉత్తరాంధ్ర 0.51 కోట్లు
ఈస్ట్ 0.20 కోట్లు
వెస్ట్ 0.16 కోట్లు
గుంటూరు 0.26 కోట్లు
కృష్ణా 0.18 కోట్లు
నెల్లూరు 0.12 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 4.26 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.30 కోట్లు
ఓవర్సీస్ 1.35 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 6.91 కోట్లు ఈ చిత్రం రాబట్టింది.
కాగా లవ్, ఎమోషన్స్,సస్పెన్సు, సోషల్ మెసేజ్ బ్లెండ్ చేసి ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాహుల్ శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని మలచాలని ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు. కమర్షియల్ గా ఈ సినిమా ప్లాప్ అయింది. పైగా శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే ఓన్ గా రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి, ఈ సినిమాతో నిర్మాతకు భారీ నష్టాలు తప్పవు. ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్ నష్టాల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More