Charan And Upasana Assets: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోల లిస్ట్ తీస్తే అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) పేరు కచ్చితంగా ఉంటుంది. మగధీర చిత్రం తోనే నేషనల్ లెవెల్లో క్రేజ్ ని సంపాదించుకున్న ఆయన, ఆ తర్వాత హిందీ లో జంజీర్ చిత్రం తో అక్కడి ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేసాడు కానీ, ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో మళ్లీ హిందీ ప్రాజెక్ట్స్ జోలికి వెళ్ళలేదు. కానీ #RRR చిత్రం తో ఆయన గ్లోబల్ లెవెల్ లో సంపాదించుకున్న క్రేజ్ మామూలుది కాదు. ఆయన హీరో గా నటించిన రీసెంట్ చిత్రం గేమ్ చేంజర్ కమర్షియల్ గా అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటే రామ్ చరణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇది కాసేపు పక్కన పెడితే రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు పూర్తి అయ్యింది. ఈ రెండు దశాబ్దాల్లో ఆయన సంపాదించిన డబ్బులు, ఏర్పాటు చేసుకున్న ఆస్తులు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. చరణ్ కి వారసత్వం గా వచ్చిన ఆస్తులను, తన సొంత ఆస్తులను కలుపుకొని చూసుకుంటే దాదాపుగా 1370 కోట్ల రూపాయిల విలువ ఉంటుందని అంచనా. ఇక ఉపాసన ఆస్తుల విషయానికి వస్తే, ఈమె అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కి ప్రస్తుతం చైర్ పర్సన్ గా వ్యహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె సంపాదన తో పాటు, వారసత్వం గా వచ్చిన ఆస్తుల విలువ 1130 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా రామ్ చరణ్ తో కలిపి దాదాపుగా 2500 కోట్ల రూపాయిల నికర ఆస్తులు ఉన్నాయని టాక్.
ఇకపోతే రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ కాబట్టి, ఆయన తన ప్రతీ సినిమాకు 75 నుండి 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. ఇది సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం ఆయన వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు కాబట్టే ఇంత, ఒకవేళ పెద్ది చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తిరగరాస్తే మాత్రం ఆయన తన రెమ్యూనరేషన్ ని ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఎలాంటి ఆస్తులను ఏర్పాటు చేసుకుంటాడో, ఎంత సంపాదన ఆర్జిస్తాడో చూడాలి.