Upasana : నందమూరి-కొణిదెల ఫ్యామిలీ హీరోలు కలిసి సినిమా చేయడం ఒక సంచలనం. అందుకు రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కేవలం ఆయన దర్శకుడు కావడం వలనే ఇది సాధ్యమైంది. దశాబ్దాలుగా ఈ రెండు కుటుంబాల హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ నెలకొంది. ఇద్దరు హీరోల అభిమానులను నిరాశపరచకుండా ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించాడు. అయినప్పటికీ ఫ్యాన్ వార్ నడిచింది. ఆర్ ఆర్ ఆర్ లో మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అని ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాటల యుద్దానికి దిగారు.
ఫ్యాన్స్ మధ్య రైవల్రీ ఉన్నప్పటికీ ఎన్టీఆర్-రామ్ చరణ్ చాలా క్లోజ్. తరచుగా వీరు కలుస్తూ ఉంటారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్ లలో పాల్గొంటారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, చరణ్ వైఫ్ ఉపాసన సైతం మంచి ఫ్రెండ్స్. ఇటీవల రామ్ చరణ్, ఎన్టీఆర్ కుటుంబాలు లండన్ లో సందడి చేశాయి. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ఫ్యామిలీ హాజరైంది. అలాగే రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ఆర్ ఆర్ ఆర్ కాన్సర్ట్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్ కుటుంబాలు హాజరయ్యాయి.
ఎన్టీఆర్, రామ్ చరణ్ సతీసమేతంగా లండన్ కి వెళ్లిన నేపథ్యంలో లక్ష్మి ప్రణతి, ఉపాసన కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో ఉపాసనను లక్ష్మి ప్రణతి గురించి అడగ్గా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఉపాసన మాట్లాడుతూ.. లక్ష్మి ప్రణతి వయసులో నా కంటే చిన్నది. కానీ ఏ విషయాన్ని అయినా మేనేజ్ చేయగలదు. తాను చాలా స్ట్రాంగ్ అండ్ స్వీట్. తనతో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రణతిని భార్యగా పొందిన తారక్ చాలా లక్కీ.. అని చెప్పుకొచ్చింది. ఉపాసన కామెంట్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
లక్ష్మి ప్రణతి హౌస్ వైఫ్. ఆమె పెద్దగా ప్రచారం కోరుకోదు. ఇప్పుడిప్పుడే ఆమె ఎన్టీఆర్ తో బహిరంగంగా కనిపిస్తున్నారు. ఇక ఉపాసన బడా వ్యాపారవేత్త. ఆమెకు పలు విషయాల్లో ప్రావీణ్యం ఉంది. అటు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే, సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమన్ గా రాణిస్తుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు వారి సతీమణులు సప్పోర్ట్ మెండుగా ఉంది. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో పెద్ది చేస్తున్నాడు.
Compliment from Vadina Itself
Very Lucky anna nuvvuAdvc HBD bday @tarak9999 ♥️ pic.twitter.com/qy3jsTWUjy
— EshwaRC16 Raj(Dhfc) (@EshwarDhfc) May 19, 2025