Upasana Delivery Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ప్రస్తుతం మహర్దశ నడుస్తుంది. #RRR చిత్రం తో గ్లోబల్ వైడ్ క్రేజ్ మరియు పాపులారిటీ ని దక్కించుకున్న రామ్ చరణ్, గత ఏడాది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభవార్తని కూడా తెలియచేసాడు. రామ్ చరణ్ మరియు ఉపాసనలకు పెళ్ళై పదేళ్లు దాటినప్పటికీ పిల్లలు లేకపోవడం తో సోషల్ మీడియా లో ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి.
అలాంటి ట్రోల్ల్స్ అన్నిటిని ఎగురుకుంటూ మెగా అభిమానులు దీటైన సమాధానం చెప్పుకొచ్చేవారు. ఉపాసన కూడా ఏ ఇంటర్వ్యూ కి వెళ్లిన యాంకర్లు ఈ విషయం గురించే ప్రశ్నలు అడిగేవారు. పెళ్ళై అన్నేళ్లు పిల్లలు లేకుంటే ఎవరికైనా ఇలాంటి సంఘటనలు రావడం సహజం, అది సెలెబ్రిటీలు అయినా, మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయినా ఇలాంటివి ఎదురుకోక తప్పదు, ఉపాసన మరియు రామ్ చరణ్ విషయం లో కూడా అదే జరిగింది.
ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి నోటి నుండి నేను మరోసారి తాతని కాబోతున్నాను అని వార్త వచ్చిందో అప్పటి నుండి మెగా అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి.ఇక డెలివరీ డేట్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. ఉపాసన వచ్చే నెలలోనే డెలివరీ కాబోతుందట. డెలివరీ ని అమెరికా లో చేయిద్దామని రామ్ చరణ్ అనుకున్నా అందుకు ఉపాసన ఒప్పుకోలేదట. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లోనే డెలివరీ చేయించుకుంటానని చెప్పిందట. దీనితో వచ్చే నెలలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లోనే ఉపాసన డెలివరీ చేయించుకోబోతుంది. ఆమె డెలివరీ కోసం ఒక ఫ్లోర్ మొత్తాన్ని బ్లాక్ చేశారట. ప్రపంచం లోనే అత్యుత్తమ గైనకాలజిస్ట్స్ ని ఉపాసన డెలివరీ అయ్యే 24 గంటల ముందే రప్పించబోతున్నారట.
ఉపాసన డెలివరీ అయ్యే ఫ్లోర్ లోకి కుటుంబ సబ్యులకు మినహా ఎవరికీ అనుమతి ఉండదట,చివరికి వ్యక్తిగత సహచరులకు కూడా ప్రవేశం లేదు. ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకొనుటకు పీడీయాట్రిషన్స్ ని కూడా పిలిపించబోతున్నారట. అలా ఒక యువరాణి ప్రసవించేటప్పుడు ఎలాంటి ఆర్భాటాలు ఉంటాయో, అలాంటి ఆర్భాటాలన్నీ ఉపాసనకు చేయబోతుంది కుటుంబం.