Chiranjeevi- Anchor Varshini: బుల్లితెర యాంకర్స్ తో మెగాస్టార్ రొమాన్స్..ఈ వయస్సులో అవసరమా బాసూ!

'భోళా శంకర్' సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Written By: Vicky, Updated On : June 12, 2023 8:05 am

Chiranjeevi- Anchor Varshini

Follow us on

Chiranjeevi- Anchor Varshini: 67 ఏళ్ళ వయస్సు లో కూడా లుక్స్ పరంగా కానీ, యాక్టింగ్ , డ్యాన్స్, ఫైట్స్ మరియు డైలాగ్ డెలివరీ లో కానీ నేటి తరం స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా పోటీని ఇస్తున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. కేవలం పెర్ఫార్మన్స్ పరంగా మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ పరంగా కూడా ఆయన నేటి తరం స్టార్ హీరోలకంటే ఎక్కువ రికార్డ్స్ కొల్లగొడుతున్నాడు.

మన టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 5 నాన్ రాజమౌళి హైయెస్ట్ గ్రాస్ ని సాధించిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి సినిమాలే రెండు ఉన్నాయి. మరో స్టార్ హీరో ఆయన దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. ఇంత వయస్సులో ఈ రేంజ్ స్టార్ స్టేటస్ ఉన్న హీరో రజినీకాంత్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో 140 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన చిరంజీవి , ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో మన ముందుకి రాబోతున్నాడు.

‘భోళా శంకర్’ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమెతో చిరంజీవి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా చేసాడట. అందులో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ నడుము సన్నివేశం కూడా ఒకటి.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ‘సంగీత్’ సాంగ్ ని చిత్రీకరిస్తుంది మూవీ టీం.

సినిమాలో పనిచేసిన ప్రతీ ఒక్క ఆర్టిస్టు ఈ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి చిందులు వేస్తున్నారు. ఈ లొకేషన్ లో ప్రముఖ యాంకర్ వర్షిణి కూడా ఉన్నట్టు రీసెంట్ గా విడుదల చేసిన ఫోటో ద్వారా తెలిసింది. అంటే చిరంజీవి శ్రీముఖి మరియు వర్షిణి తో రొమాన్స్ చేయబోతున్నాడా వంటి సందేహాలు తలెత్తాయి. 67 ఏళ్ళ వయస్సులో ఇవన్నీ అవసరమా బాసూ అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.