Thaman Wife: టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న టాప్ 3 స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడు థమన్. ఆయన ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే, అది కచ్చితంగా సూపర్ హిట్ సినిమా అవుతుంది అనే బ్రాండ్ ఇమేజి వచ్చేసింది. అందుకు కారణం కంటెంట్ తో సంబంధం లేకుండా థమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సదరు సన్నివేశాన్ని ఒక రేంజ్ లో ఎలివేట్ చేస్తుంది. అందుకే ప్రతీ స్టార్ హీరో తన సినిమాకి థమన్ సంగీత దర్శకుడిగా కావాలని కోరుకుంటూ ఉంటారు.
అయితే థమన్ సంగీతం కి ఎంత క్రేజ్ ఉంటుందో, సోషల్ మీడియా లో అదే రేంజ్ నెగటివిటీ కూడా ఉంటుంది. ఆయన సంగీతం అందించిన సినిమాకి సంబంధించి టీజర్ కానీ,ట్రైలర్ కానీ మరియు పాటలు కానీ విడుదలైనప్పుడు సోషల్ మీడియా లో పాజిటివిటీ కంటే నెగటివిటీనే ఎక్కువ ఉంటుంది. ఈ నెగటివిటీ ని తట్టుకోలేక థమన్ సోషల్ మీడియా కి గత కొంతకాలం నుండి దూరంగా ఉంటూ వస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా ‘థమన్’ భార్య పేరు వర్దిని అని, ఆమె కూడా ఒక ప్లే బ్యాక్ సింగర్ అనే విషయం మన అందరికి తెలిసిందే. ఈటీవీ లో ప్రసారమయ్యే ‘స్వరాభిషేకం’ అనే ప్రోగ్రాం ద్వారా ఈమె సింగర్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యింది. ఆ తర్వాత ఆమె తెలుగు మరియు తమిళ బాషలలో పలు సినిమాలకు పాటలు కూడా పాడింది. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో థమన్ పై వచ్చే ట్రోల్ల్స్ గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ ‘మేము ఇంట్లో ఉన్నప్పుడు సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్ల్స్ గురించి అసలు మాట్లాడుకోము.
కానీ థమన్ కంపాక్ చేసిన సాంగ్ విడుదలైనప్పుడు కానీ, ఆయన ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ అప్పుడప్పుడు చూస్తుంటాను.వాటి క్రింద కామెంట్స్ కొన్ని నెగటివ్ వి చూసి ఒక రోజు నా మూడ్ మొత్తం పాడైపోయింది. ఆరోజు అన్నం కూడా తినలేకపొయ్యాను. అందుకే అప్పటి నుండి థమన్ యూట్యూబ్ వీడియోస్ క్రింద కామెంట్స్ చూడడం మానేసాను’ అంటూ చెప్పుకొచ్చింది.