Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన చేసిన ఓ పోస్టు ప్రస్తుతం వివాదాస్పదంగా మారడంతో కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. జనవరి 26 సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ.. సామాన్యుల ఫొటోలతో ఎడిట్ చేసిన ఓ గుడి గోపురం ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందులో తాను, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది.

గుడిని అవమానించేలా ఉన్న ఆ పోస్టు వెంటనే డిలీట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వివాదం రేపుతున్న తన పోస్ట్ పై ఉపాసన మాత్రం ఇంకా సంధించలేదు. ఇక మెగా కోడలిగా కామినేని ఇంటి ఆడపడుచుగా ‘ఉపాసన’కి మంచి క్రేజ్ ఉంది. 1989లో జూలై 20న ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన ఉపాసన, మొదటి నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు.. రిజిస్ట్రేషన్ కోసం పోటీ..!
ప్రస్తుతం ఉపాసన అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంది. అయితే, తాను ఎంత బిజీగా ఉన్న నిత్యం హెల్త్ విషయంలో అనేక చిట్కాలను తెలుసుకుని ప్రజలకు తెలియజేస్తూ. సమాజం పట్ల ఎంతో నిబ్బద్ధత చూపిస్తూ ఉంది. మరి అలాంటి ఉపాసన పోస్టు చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది అనే సరికి మెగా ఫ్యాన్స్ కూడా ఏమిటా ఆ పోస్ట్ అంటూ ఓపెన్ చేసి చూస్తున్నారు.
దాంతో ఈ పోస్ట్ మరింతగా వైరల్ అవుతుంది. అన్నట్టు ఉపాసన భవిష్యత్తులో సినీ నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టబోతుంది అని ఆమె గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.
Also Read: ఏపీ రోడ్లపై తిరిగితే బాడీ మసాజ్ అయిపోతుంది.. సోము సెటైర్లు మామూలుగా లేవండోయ్..